YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

చిన్నారికి స్పీకర్‌ ఫీడింగ్‌..నెటిజన్లు ఫిదా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌

చిన్నారికి స్పీకర్‌ ఫీడింగ్‌..నెటిజన్లు ఫిదా         సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర ఘటన  చోటు చేసుకుంది. సాధారణంగా పార్లమెంట్‌ అంటే సభా సభ్యుల వాగ్వాదాలు..ప్రతిపక్షాల ఆరోపణలు..అధికార పక్షల వివరణలు వినిపిస్తాయి. కానీ అధికార విపక్షాల ఆందోళనలు కాకుండా చిన్నారి ఏడుపు వినిపించింది. తమాటీ కోఫీ అనే ఎంపీ నెల వయసున్న తన కుమారుడిని పార్లమెంటుకు తీసుకొచ్చింది. సభా చర్చలో భాగంగా కోఫీ ప్రసంగించాల్సి వచ్చింది. ఆ సమయంలో బాబు ఏడవడంతో స్వయంగా స్పీకర్‌ ట్రెవోర్‌ మల్లార్డ్‌ తన కుర్చీ వద్దకు తీసుకు రమ్మని ఆదేశించారు. అంతే కాకుండా నెల వయసున్న ఆ చిన్నారికి పాలు కూడా పట్టారు. ఓ వైపు పాలు పడుతూనే సభలో సభ్యుల ప్రసంగాలు విన్నారు. అంతే కాదు ఆ చిన్నారితో ఆడుకుంటూనే సమయానికి మించి ఎక్కువసేపు మాట్లాడిన వారిని వారించారు.బాబుతో స్పీకర్‌ ఆడుకున్నప్పడు తీసిన ఫొటోలను మల్లార్డ్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘సాధారణంగా స్పీకర్‌ కుర్చీలో సంబంధిత అధికారి మాత్రమే కూర్చుంటారు. కానీ నాతో పాటు ఓ అతిథి వచ్చి చేరాడు. కోఫీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు’ అని క్యాప్షన్‌ ఇచ్చి ఈ ఫొటోలను షేర్‌ చేశారు. అప్పటి నుంచి అవి సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. స్పీకర్‌ స్థాయి వ్యక్తి చిన్నారికి ఫీడింగ్‌ ఇవ్వడం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మీది చిన్న దేశమైనప్పటికీ..ప్రపంచానికి పెద్ద సందేశం ఇచ్చారు’ అని కామెంట్లు పెడుతున్నారు.ఇలా న్యూజిలాండ్ పార్లమెంటులోకి చిన్నారులు రావడం ఇదే మొదటి సారి కాదు. న్యూజిలాండ్‌ ప్రధాని జసిందా ఆర్డెర్న్‌ కూడా తన కన్నబిడ్డను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పిల్లలను సభలోకి తీసుకు రావడం అదే మొదటి సారి.

Related Posts