YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్ల ఆశచూపి వృద్దుడు లైంగిక దాడి

చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్ల ఆశచూపి వృద్దుడు లైంగిక దాడి

కామంతో కళ్లు మూసుకుపోయి అభం, శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి ఓ వృద్దుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి రమ్మన్నాడు తాత లాంటి వ్యక్తే కదాని ఆ చిన్నారి అతనివెంట వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో అతడిలోని మృగం నిద్ర లేచింది. ఈ సంఘటనపై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు. మందస మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అరవై రెండేళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి సోంపేట సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొరకల రుషి (62) ఈనెల 18న రెండో తరగతి విద్యార్థినికి బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తానని ఇంటికి రమ్మన్నాడు. అతడి ఉద్ధేశం తెలుసుకోలేని ఆ చిన్నారి అతడి వెంట వెళ్లగా రుషి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన జరిగిన మరుసటిరోజు చిన్నారి అస్వస్థతకు గురైంది. జననేంద్రియం నొప్పిగా ఉందని, మూత్ర విసర్జన చేసినపుడు ఇబ్బందిపడుతున్నట్లు తన తల్లితో చెప్పింది. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం తెలిసింది. జరిగిన ఘోరాన్ని చిన్నారి తల్లిదండ్రులు గ్రామపెద్దల దృష్టికి తెచ్చారు. పెద్దల సమక్షంలో చేసిన తప్పును నిందితుడు కూడా అంగీకరించాడు. తాను చేసిన తప్పుకు బాధిత కుటుంబానికి కొంత డబ్బు ఇస్తానన్నాడు. అందుకు చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. న్యాయం కోరుతూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడిని సోంపేటకు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Related Posts