Highlights
- ఓ ప్రముఖ హాలీవుడ్ వెబ్‌సైట్ కధనం
- కొట్టిపారేస్తున్న ఫ్రెండ్స్
''వారిద్దరు ప్రేమలో ఉన్నారన్నది వాస్తవం. అయితే, ఈ విషయంలో ‘హ్యారి పోటర్’లో హెర్‌మియోన్ గ్రేంజర్‌గా నటించిన బాలనటి ప్రస్తుత ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ ఫేమ్ ఎమ్మా వాట్సన్ మౌనాన్ని పాటిస్తోంది. తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటోంది" అంటూ కొంతమంది సన్నిహితులు చెబుతుండగా.. "వాళ్ళ మధ్య ఉన్నది స్నేహమే తప్ప మరే సంబంధమూ లేద"ని మరి కొంతమంది సన్నిహితులు వాదిస్తున్నారు...అసలేం జరిగింది..
‘గ్లీ’ సినిమా నటుడు, గాయకుడు కోర్డ్ ఓవర్ స్ట్రీట్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్టు హాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా పలు సందర్భాల్లో ఈ జంట చూపరుల కంట పడుతోంది. ఈ జంట మొదటిసారిగా ఫిబ్రవరిలో ట్రూబాడూర్‌లో జరిగిన ఓ సంగీత విభావరిలో కనిపించినట్టు ఓ ప్రముఖ హాలీవుడ్ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేగాకుండా.. తాజాగా జరిగిన వానిటీ ఫెయిర్ ఆస్కార్స్ పార్టీలో కూడా వీరు సందడి చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల అనంతరం జరిగిన పార్టీలో వీరు మామూలుగానే కలుసుకుని ఉండొచ్చు అని సమాచారం.