Highlights
- సింగరేణి కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు
- కేసీఆర్, ఎంపీ కవిత ఫ్లెక్సీలకు క్షిరాభిషేకం
- మిఠాయిలు పంచిన కార్మికులు
సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేసీఆర్ నిలబెట్టుకున్నారు. సింగరేణి కారుణ్య నియామకాలను చేపట్టాలని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు, చనిపోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు వరంగా మారాయి.
కారుణ్య నియామకాల ఉత్తర్వులు జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితకు ఈ సందర్భంగా సింగరేణి కార్మికులంతా ధన్యవాదాలు తెలియజేశారు. సింగరేణిలో సంబురాలు ఈసందర్బంగా.. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ఫ్లెక్సీలకు కార్మికులు పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు.