YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన ఎఫ్ఏటీఎఫ్

పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన ఎఫ్ఏటీఎఫ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పాకిస్థాన్ కు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) షాక్ ఇచ్చింది. టెర్రరిస్టు సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, మనీ లాండరింగ్ కు పాల్పడటం వంటి కారణాలతో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో ఉంచింది. టెర్రరిస్టులకు నిధులను అందించే అంశానికి సంబంధించిన 40 పారామితుల్లో 32 పారామితులు సమ్మతించే విధంగా లేవని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది.41 మంది సభ్యుల ప్యానెల్ ను పాకిస్థాన్ తన వాదనతో ఒప్పించలేకపోయిందని వెల్లడించింది. మరోవైపు, బ్లాక్ లిస్టు నుంచి తప్పించుకోవడానికి అక్టోబరులోగా పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. ఆ దేశ ర్యాంకింగ్ ను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ లు డౌన్ గ్రేడ్ చేస్తాయి.

Related Posts