యువ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో సింధూ 12-21, 23-21, 21-19 తేడాతో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌పై విజయం సాధించింది. మరోవైపు ఛైనా షట్లర్ చెన్ యు ఫీ, డెన్మార్క్ షట్లర్ మియా బ్లీచ్ఫెల్డ్ మధ్య జరుగుతోన్న రెండో క్వార్టర్స్‌లో గెలిచిన వారితో సింధూ శనివారం సెమీస్ ఆడనుంది