YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

పెద్దాపురంలో 'అతిరాత్రం'

Highlights

  • వచ్చే నెల 14 నుంచి 25 వరకు 
  • 26  న పుత్ర కామేష్టి యాగం 
  • 27 న మహా ప్రత్యంగిర హోమం 
పెద్దాపురంలో 'అతిరాత్రం'

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో వచ్చే నెల 14 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు మహాగ్ని చయన పూర్వక మహత్కష్ట సోమయాగం అతిరాత్రంను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు బ్రహ్మశ్రీ కిరణ్ అవధాని తెలిపారు. బ్రహ్మశ్రీ కేశవ్ అవధాని ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అతిరాత్రం మహా యజ్ఞాన్ని పెద్దాపురంలోని సూర్యనారాయణ ఆలయం దిగువన ఉన్న పాండవుల మెట్టలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ యాగంలో  భాగంగా వచ్చే నెలల 26 వ తేదీన పుత్ర కామేష్టి యాగం, 27 వ తేదీన మహా ప్రత్యంగిర హోమం చేపట్టనున్నట్టు కిరణ్ అవధాని తెలిపారు. 

Related Posts