యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వెల్లడించింది.