Highlights
'బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారో, ఇక్కడ గమనిద్దాం..
అశ్విని :
చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషనులు.
భరణి :
దృడ నిశ్చయులు ,సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
కృత్తిక :
ప్రక్యతులు, తేజస్సులు.
రోహిణి :
సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్దిరమతి , సురూప.
మృగశిర :
చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.
ఆరుద్ర :
గర్వితులు, కృతఘ్నులు, అయిన వారిని ప్రేమించే వారు.
పునర్వసు :
మంచి స్వభావం కలవారు, అల్ప సంతుష్టులు , రోగులు.
పుష్యమి :
శాంతస్వభావం కలవారు. పండితులు, ధర్మ పరాయణులు.
ఆశ్లేష :
సర్వ భక్షకులు, కృతఘ్నులు, అమాయకులు , సున్నితత్వం కలవారు.
మఖ :
భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, మహొద్యమ కారులు.
పూర్వఫల్గుణి :
ఎప్పుడు ప్రియ వచనములు పలుకు వారు. దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.
ఉత్తరఫల్గుణి :
భోగులు, సుఖములు కలవారు, విద్య ప్రాప్తి కలవారు.
హస్త :
ఉత్సాహవంతులు , చోర స్వభావం కలిగి ఉంటారు.
చిత్త :
మీననేత్రులు. గడసరులు.
స్వాతి :
కృపాళులు , ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు .
విశాఖ :
ఈర్ష బుద్ధి కలవారు. ద్యుతులు, మాన్యవచనులు.
అనురాధ :
విదేశీ యానం కలవారు, ధర్మాత్ములు.
జ్యేష్ఠ :
పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు.
మూల :
లక్ష్మి పుత్రులు , సుఖపడువారు, స్ధిర మనసు కలవారు.
పూర్వషాడ :
సౌహర్ర్ధ హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడు వారు.
ఉత్తరాషాడ :
ధార్మికులు, బహు మిత్రులు కలవారు, కృతజ్ఞత కలిగిన వారు .
శ్రవణం :
ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి పొందేడివారు , ధనవంతులు.
ధనిష్ట :
దాతలు, ధన లబ్దము కలిగిన వారు, సంగిత ప్రియులు.
శతభిషం :
సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు.
పూర్వాభాద్ర :
సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు, ధనవంతులు, దాతలు.
ఉత్తరాభాద్ర :
ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు.
రేవతి :
శూరులు, శుచివంతులు, సుభగులు, సంపూర్ణంగులు కలవారు.