Highlights
- ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులపై భౌతిక దాడి
- శ్రీలంక క్రికెట్ బోర్డు ఆగ్రహం
మద్యం సేవించి కార్ నడుపుతున్న శ్రీలంక క్రికెటర్ రమిత్ రామ్ బుక్వెల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసే కాకుండా భౌతిక దాడికి తగపడిన ఘటననలో కూడా దొరికిపోయారు. ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులపై దాడికి పాల్పడిన కారణాలతో కూడా అతన్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం కూడా రజిత్ డ్రంకన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. విద్యార్థులపై దాడి అనంతరం కొలంబోలోని నవాలా హైవేపై వెళుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. రమిత్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అతన్ని అలుత్ కేడ్ మేజిస్ట్రేజ్ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. రమిత్ పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డుకు సంబంధించిన ఓ అధికారి హెచ్చరించారు. తాజా పరిణామాలతో, శ్రీలంక క్రికెట్ కాంట్రాక్టును అతను కోల్పోయే పరిస్థితి నెలకొంది.