యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశం లోను, విదేశాలకు వివిధ రకాల పర్యటనలు నిర్వహించడంలో 48 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం కలిగి దేశవ్యాప్తంగా 10కి పైగా ప్రధాన నగరాల్లో శాఖలు ద్వారా సేవలనందిస్తూ పర్యాటక మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం చే 8 సంవత్సరములు పాటు 'ఉత్తమ దేశీయ టూర్ ఆపరేటర్' గా అవార్డుతో పాటు ఎన్నో ప్రముఖ సంస్థలనుండి అవార్డులు , ప్రశంసలు అందుకున్న సదరన్ ట్రావెల్స్ వారు 2019 నవంబర్ 5వ తేదీ నుండి 16వ తేదీ వరకు అస్సాం రాష్ట్రము ,గౌహతి నందు పరమ పవిత్రం గా జరుగు బ్రహ్మపుత్ర నాదీ పుష్కరాలకు అష్ఠాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్యా దేవి దర్శనార్ధం భక్తుల ప్రయాణానికి , వసతి మొదలైన వాటికొరకు అందరికి అందుబాటులో వుండేవిధం గా రెండు ప్యాకేజీలను ( BHP -01 ( 3 పగళ్లు / 2 రాత్రులు ) మనిషికి రూ.7400 /- నుంచి మొదలవుతుంది మరియు BHP -02 ( 5 పగళ్లు / 4 రాత్రులు ) మనిషికి రూ.12 ,950 /- నుంచి మొదలవుతుంది అని తెలిపింది . వీటి ద్వారా బ్రహ్మపుత్రనదీ పుష్కరాలు మరియు అస్సాం, మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని ఇతర పుణ్య క్షేత్రాలు మరియు పర్యాటక ప్రాంతాలు సందర్శించుకునే విధం గా ఈ ప్యాకేజీలు వుంటాయని మరియు మరిన్ని వివరములు తమ శాఖలు సంప్రదించవలిసిందిగా తెలిపింది..