బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్ లో పీవీ సింధు... గతంలో ఐదు సార్లు పాల్గొని నాలుగు పతకాలు గెలుచుకుంది. కానీ గోల్డ్ మెడల్ మాత్రం రాలేదు. రెండుసార్లు ఫైనల్స్ వరకూ వెళ్లి రజత పతకాలు, మరో రెండు సార్లు సెమీస్ తో సరిపెట్టుకుని కాంస్యాలు గెలుచుకుకుంది. కానీ, నేడు మాత్రం పరిస్థితులన్నీ సింధూకే అనుకూలంగా ఉండటంతో జగజ్జేతను ఓడించి, మరో జగజ్జేతగా అవతరించే క్షణాలు ఇవేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ లో సింధు, ఒకుహరాను ఎదుర్కోవాల్సి వుంది. 2017 ఫైనల్ లో ఒకుహరా చేతిలో ఇదే పోటీలో పోరాడి ఓడిన సింధు, ఈ దఫా ఆమెపై గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖాముఖి రికార్డులో ఒకుహరాపై 8–7తో ఆధిక్యంలో సింధు ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుండగా, స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.