మాజీ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పార్థీవ దేహాన్ని కైలాష్ నగర్‌లోని ఆయన నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 1.30 వరకు ఆయన భౌతికకాయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.