YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ పార్టీలో తీవ్రమౌతున్న ప్రజాస్వామ్యం

 కాంగ్రెస్ పార్టీలో తీవ్రమౌతున్న ప్రజాస్వామ్యం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారత జాతీయ కాంగ్రెస్ ఇక కోలుకోలేదనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీకి తగ్గ నేత కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం ఒక మైనస్ అయితే…..ఆ పార్టీ స్వయంకృతాపరాధమే మరొక కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాహుల్ ను ఇంకా యువకుడిగానే ప్రజలు చూస్తున్నారు. రాహుల్ లో రాజకీయ పరిపక్వత లేదని భావిస్తున్నారు. అందుకే రాహుల్ ప్రధాని పదవికి అనర్హడంటూ ప్రజలు తీర్పు చెప్పారు. స్వయంగా గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన అమేధీలోనే రాహుల్ ఓటమి ఇందుకు కారణంగా చెప్పుకోవాలి.పాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పాత విధానాలనే పట్టుకు వేలాడుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇంకా ప్రాముఖ్యతనిస్తోంది. ఇప్పుడు దేశం మారింది. దేశం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించే రోజులివి. అంతేకాదు సామాజిక మాధ్యమాల విస్తృతి కూడా బాగా పెరిగిపోయింది. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం మూస పద్ధతిలోనే వెళుతోంది. ఇందుకు 370వ అధికరణ రద్దు ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవాలి.370 అధికరణ రద్దు కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకించింది. పార్టీలోని అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుపట్టారు.
370 అధికరణం రద్దును కొందరు కాంగ్రెస్ నేతలు సమర్థించారు. కాశ్మీర్ లోయలో 70ఏళ్లుగా జరుగుతున్న తంతును చూసి, విన్న దేశ ప్రజలు మోదీ నిర్నయాన్ని సమర్థించారు. కానీ ఈ విషయంలో
కాంగ్రెస్ పెద్దమనసు చేసుకోలేకపోయింది. దాని వల్ల దేశంలో ప్రజాస్వామ్యం హత్య చేయబడిదంటూ కూనిరాగాలు తీసింది. దీంతో మరింత దీనావస్థకు చేరుకుంది.370 ఆర్టికల్ రద్దును రాహుల్ కుఅత్యంత సన్నిహితుడైన జ్యోతిరాదిత్య సింధియా వంటి వారే సమర్థించారు. సీనియర్ నేతలు కొందరు మౌనం దాల్చారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు మోదీపై విమర్శలు వద్దని సూచిస్తున్నారు. జైరాం రమేష్ వంటి నేతలు మోదీ మంచి పనులు చేస్తున్నారంటూ కితాబిస్తున్నారు. అభిషేక్ సింఘ్వీ, శశిధరూర్ లాంటి నేతలు సయితం మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. నిజంగా ఇది సోనియా గాంధీకి సవాల్ లాంటిదే. అధ్యక్ష పీఠంలో ఉన్న సోనియా గాంధీ మోదీని విమర్శించకుండా పార్టీని పైకి తీసుకురావడమెట్లా అన్నది ఇప్పుడు ఛాలెంజ్.

Related Posts