YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆరు ముస్లిం దేశాల అవార్డులు మరే ప్రధానికి దక్కని రివార్డులు

ఆరు ముస్లిం దేశాల అవార్డులు  మరే ప్రధానికి దక్కని రివార్డులు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఒక్క పాకిస్థాన్ తప్ప ప్రపంచంలోని అన్ని ఇస్లాం దేశాలకు భారత్ అంటే అభిమానం. మన నిజాయితీ, శాంతి, సాంప్రదాయాం, తెలివి తేటలు, కష్ఠపడే తత్వం అంటే ఎంతో గౌరవం. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేనంతగా భారతీయులు ఇస్లాం దేశాలలోనే ఉంటున్నారు. మత ప్రాతిపదిక ఏర్పడిన దేశాలైన ఎన్నడు మన భారతీయులను తక్కవ చేసి చూడలేదు. అందుకే లక్షల్లో భారతీయుల అక్కడికి చేరుతున్నారు. ఉపాధి, ఉన్నత ఉద్యోగాలు పొందుతు ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో పాలు పంచుకొంటున్నారు. ఈ సంబంధాలు మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్ కూడా మన గౌ. ప్రధాని నరేంద్రమోదీ గారి నాయకత్వంలో ముందుకు వెలుతున్నది. ఆలాగే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కూడా భారత దేశంతో మంచి సంబందాలను కోరుకుంటున్నాయి. ఇక్కడే నరేంద్రమోదీ గారి నాయకత్వ పటిమ, ఆలోచన విధానాన్ని గుర్తించి ఆరు ముస్లిం దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటించి... సత్కరించాయి. బహుశా ప్రపంచంలో ఈ స్థానం మరే దేశ ప్రధానికి దక్కి ఉండకపోవచ్చు. మనకు ఇంతటి పేరు తెచ్చిపెట్టిన ఆ ఆరు పురస్కారాలను మరో సారి గుర్తుకు తెచ్చుకుందాం.

మన పక్క దేశమైన అఫ్గానిస్తాన్ 2016లో "అమీర్ అమానుల్లాహ్" అవార్డు అందజేసి భారత్ పట్లా తమకున్న గౌరవాన్ని చాటుకుంది.
 సౌదీ అరేబియా 2016లో  “కింగ్ అబ్దులాజీజ్ ” అవార్డుతో  సత్కరించి భారత్ తో తమకున్న అనుబంధాన్ని ప్రపంచానికి తెలియజేసింది.
పాలస్తీనా 2018లో “గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా" అవార్డుతో గౌరవించి స్నేహ హస్తాని అందజేసింది.
 యుఎఇ 2019లో  'ఆర్డర్ ఆఫ్ జాయెద్' తో సత్కరించి భారత్ తో తమ సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకుంది.
 బహ్రెయిన్ దేశం 2019 సంవత్సరానికి గాను “కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసాన్స్" అందజేసి భారత్ తో మరింత బలమైన సంబందాల కోసం ఎర్ర తివాచీ పరిచింది.
మాల్దీవులు 2019లో "రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్" అందజేసి తమ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని భారత్ ను మనసారా ఆహ్వానించింది.

మన గౌ ప్రధాని నరేంద్రమోదీ గారికి దక్కిన ఈ అవార్డులతో మనమంతా గర్వపడుదాం.

 
 

Related Posts