YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మారని పాకిస్తాన్ వక్రబుద్ధి

మారని పాకిస్తాన్ వక్రబుద్ధి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దాయాది పాకిస్థాన్‌ మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. తన భూభాగం పరిధిలో సట్లెజ్ నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లను ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఎత్తివేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ పరిధిలో ఉన్న సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసింది. దీంతో భారత్‌లోని పంజాబ్‌ను ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని సట్లేజ్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. తెండీవాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట తీవ్రంగా దెబ్బతినడంతో అప్రమత్తమైన పంజాబ్‌ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీచేశారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సట్లెజ్ గేట్లను పాక్ ఎత్తడంతో తెండీవాలా గ్రామాన్ని వరద చుట్టుమట్టిందని, కొన్ని వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. సట్లెజ్ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలకు సూచనలు జారీచేసిన అధికారులు.. ఆరోగ్య, పౌర సరఫరాల ఇతర శాఖల సిబ్బందిని మోహరించి, పునరావాస కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో సైనిక, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఆదేశించారు. తెండీవాలా సమీపంలోని కరకట్ట పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. పాకిస్థాన్ ఇలాంటి దురాగతాలకు పాల్పడడం తొలిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు ఎలాంటి హెచ్చరికలు లేకుండా సట్లెజ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెట్టింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని చివరి గ్రామం తెండీవాలా.. సట్టెజ్ నదీ జలాలు భారత్‌లోకి ప్రవేశించేది ఇక్కడే. పాకిస్థాన్ కసూర్ జిల్లాలోని లెదర్ పరిశ్రమల నుంచి కలుషిత జలాలను సట్లెజ్‌లోకి విడుదల చేస్తారు. ఈ జలాలు తెండీవాలా పరిసర గ్రామాలను చుట్టిముట్టడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts