YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వాటర్ సైకిల్.. ఓ అద్భుతం

Highlights

  • 120 కేజీల బరువు మోస్తుంది
  • అర లీటర్ నీటితో
  • 30 కిలోమీటర్ల ప్రయాణం 
  • పొల్యూషన్ కు చెక్ 
  • తక్కువ ఖర్చు
  • మల్టీ విధానంతో నడిచే సైకిల్ 
  • సిరిపురం బుల్లోడి అద్భుతం .
వాటర్ సైకిల్.. ఓ అద్భుతం

పెట్రోల్ డీజిల్ తో నడిచే  కార్లను చూశాం..బ్యాటరీ.. సోలార్ సహాయంతో వాహనాలను కూడా చూశాం.వీటిల్లో ఏదీ వింతకానేకాదు.. అసలు వండర్ అంతా ఓ సైకిల్ లో ఉంది. అంత వండర్ ఏంటంటే అంటున్నారా.. అక్కడికే వస్తున్నా..ఇప్పుడు సోలార్ తో బల్బు దగ్గర నుంచి వాహనాల వరకు నడుస్తుండడం సర్వసాధారణమైపోయింది. కానీ ఓ సామాన్య కుర్రాడు మన సిరిపురం వుల్లోడు ఏకంగా  ఓ అద్భుతాన్ని సృష్టించాడు. అతను వాటర్ తో సైకిలును నడుపుతూ.. తోటి యువతకు స్ఫూర్తినిచ్చాడు.  కొత్తగా ఏదైనా చేయాలనే తపించి పోయే ఆ కుర్రాడు.. తన మెదడుకు పదును పెట్టాడు. ఆ ఆలోచన నుండి వచ్చిందే వినూత్న సైకిల్ రూపకల్పన. సామాన్యుడికి వరంగా మారనున్న ఈ సైకిల్ కధ ఏంటో చూద్దామా.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సిరిపురం చంద్రశేఖర్, భారతిల చిన్న కొడుకు సిరిపురం సాయి. పదో తరగతి వరకు కోరుట్లలో చదువుకుని, నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లామా కోర్స్ లో చేరాడు. అయితే  ఆరోగ్య సమస్యల వల్ల డిప్లామా  చదువును మధ్యలోనే ఆపేసాడు. కానీ కొత్తగా చేయాలన్న తపనతో.. సాయి ఈ వినూత్న సైకిల్ తయారీకి నాంది పలికాడు.తలచిందే  తలంపుగా  ఒక పాత సైకిల్ కొని దానికి బ్యాటరీ అమర్చి, డైనమోతో కనెక్షన్ ఇచ్చాడు. దాంతో పవర్ ఉత్పత్తితో సైకిల్ నడిచేలా చేశాడు. ఆ తర్వాత  సైకిల్ కు  సోలార్ తో పాటుగా  వాటర్ కూడా అనుసంధానించి నడిచేటట్లు చేశాడు. ఈ సైకిల్ 120 కేజీల బరువుతో ముందుకు సాగిపోతుంది. అర లీటర్ నీటితో.. జరిగే విద్యుత్ ఉత్పత్తితో... 30 కిలోమీటర్ల వరకు వెలుతుందని సాయి చెపుతున్నాడు. పొల్యూషన్ ను  నివారించే విధంగా అతి తక్కువ ఖర్చుతో మల్టీ విధానంతో నడిచే సైకిల్ రూపొందించిన ఈ  సిరిపురం బుల్లోడిని పలువురు అభినందిస్తున్నారు.

Related Posts