YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రోజుకు 200లతో 35 లక్షలు

 రోజుకు 200లతో 35 లక్షలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? వ్యక్తి ప్రాతిపదికన ఈ ప్రశ్నకు సమాధానం మారుతూ ఉంటుంది. అయితే మీకు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చేతిలోని డబ్బుతో మరింత ఎక్కువ సంపాదించాలని భావిస్తే మీకు ఒక ఆప్షన్ ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). అదిరిపోయే రాబడి, పన్ను ప్రయోజనాలు వంటివి పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ల ప్రత్యేకత. మీరు ఏడాదికి పీపీఎఫ్‌లో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంతో మెచ్యూరిటీ సమంయలో భారీ రాబడితోపాటు పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం, దీనిపై అర్జించిన వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పన్ను ఉండదు. అంటే ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. పీపీఎఫ్‌లో ప్రతి నెలా లేదంటే ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై 7.9 శాతం వడ్డీ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. మీరు రోజుకు రూ.200 పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది నెలకు రూ.6,000, సంవత్సరానికి రూ.72,000 అవుతుంది. ఏడాదికి రూ.72,000 చొప్పున పీపీఎఫ్‌లో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీరు మెచ్యూరిటీ సమయంలో రూ.21 లక్షలు పొందొచ్చు. అదే రోజుకు రూ.200 కాకుండా రూ.333 పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే.. అది నెలకు రూ.9,990, ఏడాదికి రూ.1,19,880 అవుతుంది. ఈ మొత్తాన్ని పీపీఎఫ్‌లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు మెచ్యూరిటీలో రూ.35 లక్షలు సొంతం చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్‌ను పోస్టాఫీస్ లేదా ఎస్‌బీఐ సహా ఇతర ప్రముఖ బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు.

Related Posts