Highlights
- అంధత్వ నివారణ సంస్థ,
- సరోజనీ కంటి దవాఖాన
- కంటి దవాఖానాలో
- ఆదివారం అవేర్‌నెస్ వాక్
- ప్రారంభించిన రాష్ట్ర వైద్యమంత్రి డా.లక్ష్మారెడ్డి
ప్రపంచ గ్లాకోమా వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా అంధత్వ నివారణ సంస్థ, సరోజనీ కంటి దవాఖానా సంయుక్తంగా అవేర్‌నెస్ వాక్‌ని నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌లోని సరోజనీలో ప్రారంభించారు. నీటి కాసులుగా పిలిచే ఈ వ్యాధి చూపుపై నిశ్శబ్ధంగా, వేగంగా ప్రభావం చూపే ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఈ వాక్‌ని నిర్వహించారు.
40ఏళ్ళ పైబడిన వాళ్ళల్లో వారసత్వంగా సంక్రమించే ఈ గ్లాకోమాని గుర్తించ గలితితే సాధ్యమైనంత వైద్య చికిత్స అందించవచ్చు. కనుగుడ్డు చుట్టూ రంగుల వలయాలు ఏర్పడటం, నొప్పి ఉండటం, చూపు మందగించడం, కాంతి లేకపోవడం వంటి లక్షణాలు గ్లాకోమావి. తలనొప్పితో అలాగే తరచూ కంటి అద్దాలు మార్చాల్సి వస్తుంటుంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా 3శాతం మంది గ్లాకోమా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇండియాలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అంటే ప్రపంచంలోని గ్లాకోమా వ్యాధి గ్రస్తుల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. అంధత్వానికి రెండో అతి పెద్ద కారణం గ్లాకోమా. ప్రతి ఏడాది ఒక్క సరోజనీ దేవి దవాఖానా ప్రతి ఏడాది 10వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నది. అందులో ప్రతి ఏడాది సగటున 600 మందికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.
ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడం, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం, క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటే గ్లాకోమా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. కాగా, ఈ సందర్భంగా సరోజనీ దవాఖానా ఆధ్వర్యంలో ప్రజా చైతన్యం, ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, స్లోగన్స్, పోస్టర్ల పోటీ, రోగులకుకు అవగాహన కార్యక్రమాలు, అలాగే ప్రత్యేకంగా ఈ వారం రోజుల పాటు గ్లాకోమా స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సరోజనీ కంటి దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రవిందర్ గౌడ్ తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు.