YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

స్టాక్ మార్కెట్లు జోష్... పడిపోయిన రూపాయి, బంగారం విలువ

స్టాక్ మార్కెట్లు జోష్... పడిపోయిన రూపాయి, బంగారం విలువ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ ఇవాళ ప‌డిపోయింది. డాల‌ర్‌తో రూపాయి విలువ ఇవాళ ట్రేడింగ్ స‌మ‌యంలో 72.03గా ఉంది. అయితే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 58 పైస‌లు కోల్పోయింది. దీంతో రూపాయి విలువ డాల‌ర్‌తో పోలిస్తే 72.24గా నిలిచింది. ఇంకా ఇవాళ మార్కెట్‌లో ట్రేడింగ్ జ‌రుగుతోంది. అయితే రూపాయి విలువ మ‌రింత ప‌త‌నం అవుతుందా లేక మ‌ళ్లీ పుంజుకుంటుందా అన్న ఆస‌క్తి మార్కెట్ వ‌ర్గాల్లో ఉన్న‌ది. ఈ ఏడాదిలో రూపాయి క‌నిష్టానికి చేర‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. చైనాకు చెందిన యెన్ క‌రెన్సీ ప‌తనం కావ‌డంతో ఆ ప్ర‌కంప‌న‌లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను కుదిపేస్తున్నాయి. 11 ఏళ్ల త‌ర్వాత చైనా క‌రెన్సీ డాల‌ర్ మార‌కంతో పోలిస్తే క‌నిష్టానికి ప‌డిపోయింది. 2008లో చివ‌రిసారి చైనా క‌రెన్సీ విలువ ప‌త‌న‌మైంది. ఇవాళ చైనా మార్కెట్లో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే యెన్ విలువ 7.1468గా ఉంది. అయితే ప్ర‌స్తుం ఇంధ‌న ధ‌ర‌లు మార్కెట్లు త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా.. అది కాస్త రూపాయి బ‌లోపేతానికి క‌లిసి వ‌చ్చిన‌ట్లు అయ్యింది. మ‌రోవైపు చైనా, అమెరికా మ‌ధ్య ఉన్న వాణిజ్య యుద్ధం వ‌ల్ల బంగారం ధ‌ర‌లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
భారీ లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆర్థికవ్యవస్థ వృద్ధికి దన్నుగా వారాంతాన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసాయి. దీంతో ఒక దశలో 800 పాయింట్లు మేర సూచీలు లాభపడ్డాయి. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలపైన  కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 712 పాయింట్లు ఎగసి 37,3420 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 11,034 వద్ద ట్రేడవుతోంది. అయితే  భారీ ఒడిదుడుకుల  ధోరణి  నెలకొంది. అయితే ముగింపులో  కీలక స్థాయిలు నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, మీడియా, రియల్టీ, ప్రయవేట్‌ బ్యాంక్స్‌ 2.2-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే మెటల్స్‌ 3 శాతం, ఐటీ 0.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ 4.4-2.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటో, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, హిందాల్కో, బజాజ్‌ ఆటో, వేదాంతా, కోల్‌ ఇండియా, సిప్లా, ఓఎన్‌జీసీ  నష్టపోతున్నాయి.
40 వేలకు చేరిన బంగారం
బంగారం ధరలు సరికొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెడుతోంది. ముంబైలో సోమవారం పదిగ్రాముల బంగారం రూ 40,000 దాటింది. వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే రూ 41,000 దాటుతాయని జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ బచ్‌రాజ్‌ బమాల్వా చెప్పారు. పసిడి ధరలు పైపైకి ఎగబాకినా పండుగ సీజన్‌తో పాటు రాబోయే  పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో డిమాండ్‌పై పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని, పాత బంగారం రీసైక్లింగ్‌ పెరిగిందని ముంబై జ్యూవెలర్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌ శెట్టి చెప్పారు. ఇక దీపావళి నాటికి పదిగ్రాముల పసిడి రూ 41,000కు చేరుతుందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

Related Posts