YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సండే...సందడే...సందడి..

Highlights

  • వారాంతపు రివ్యూ..
  • తేదీ:11-03-2018
సండే...సందడే...సందడి..

లక్ష 'పెళ్ళి' బాజాలతో కోలాహలంగా వారం ప్రారంభమైయింది.ప్రత్యేకహోదా, పెడరల్ ప్రంట్, మహిళా దినోత్సవం,  మిలినియమ్ వార్తలతో అన్ని దిన పత్రికలు ఆకట్టుకున్నాయి. ఈవారం తెలుగు రాష్ట్రాల్లో ఓ వింత ఆవిష్కృతమైంది. అది ఎవరూ ప్రస్థావించకపోవడం మరీ విడ్డూరం. అదేంటో చూడండి...

తెలంగాణలో ఆయనేం చెపితే.....:
మీడియాను ఎప్పుడు, ఎక్కడ, ఎలా 'మీటితే'  ఏవిధంగా పలుకుంతుందో మాటల మాంత్రికుడు కే.సి.ఆర్.కు ఉద్యమంతో వచ్చిన విద్య. 'ఫెడరల్ ప్రెంట్'
(గమనిక:మూడో ప్రంట్ కు రచయిత పెట్టిన పేరు.) అంటూ సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించాడు. పతాక శీర్షికలన్నీ ఆయన కత్తి పట్టిన వార్తలే. ఆయన్ని 'మోస్తున్న మీడియా'కైతే ఇక 'హోళీ'నే.

 సీఎం నివాసం, సెక్రటేరియట్, పార్టీ ఆఫీసు.. అన్నీ ప్రగతిభవనే. ఆయన కార్యాలయ అధికారులు అక్కడే. ఇంతవరకు బాగానే ఉంది. 
ఇక 'ప్రంట్'లో ఏ చిన్న అప్డేట్ ఉన్నా.. సాక్షాత్తు సీఎంవో అధికారులే పార్టీ పి.ఆర్.ఓ.ల అవతారం ఎత్తి మీడియాకు అధికారిక ప్రకటనలు వెలువరిస్తున్నారు. ఈ 'ఫ్రంట్' అనేది ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. అది పార్టీ పరమైన విషయం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చెప్పినంత మాత్రాన.. అది అధికారిక అంశం అయిపోదు కదా. 'ప్రంట్' వార్తల కోసం ఇక ముందైనా ఆయన స్వంతంగా వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.

'ప్రత్యేకహోదా'లో
ఆ ఆలుమగలు ఆదర్శం:

పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి. ఆయన అమరావతిలో కూర్చుని కేంద్రంపై కారాలు మిరియాలు నురుతుంటారు.

'హోదా' ఇవ్వలేదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వంలో
నిర్మలసీతారామన్ రక్షణశాఖ మంత్రి గారు. 
దీనికి ఆమంత్రిగారు .. 'ఆఫ్ ద రికార్డు'గా చెప్పేదేమిటంటే...
"నేను పుట్టింది తమిళనాడులో, ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది కర్ణాటక నుండి. నా 'హోదా'కు ప్రత్యేక 'హోదా' కు లింకేంటి..?" అంటూ రుసు రుసలాడుతూ.. మొటికలు విరుస్తోంది.
భర్త ఓ మాట.. భార్య మరో మాట..!!  ఔరా.. ఏపీ పాలిటిక్స్..!!

'మిలియన్' కష్టాలు:
అధికారంలో లేనప్పుడు నిర్భందాలపై ఊకదంపుడు ఉపన్యాసాలు. అధికారంలోకి రాగానే తామదీ 'అదేబాట' చందాన మిలియనీయమ్ అరెస్టులు.

జగన్‌ అక్రమాస్తుల కేసులో...
జగన్‌ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడుల వ్యవహారంలో 34.64 కోట్ల రూపాయలను ఈడీ ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టివేసింది. 
మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరిస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఈ విషయంపై 'సాక్షి' కన్నా 'ఈనాడు' ప్రాముఖ్యత ఇచ్చింది. అధికారులకు ఈ చిన్నపాటి విషయం తెలియదని అనుకోవాలా..? ఈ ఫలితం జగన్ కేసుల మీద ప్రభావం ఉంటుంది. 

తెరపైకి "మిస్సింగ్ ఫైల్"
ఐ.పి.ఎస్. అధికారి ఏ.వి.రంగనాథ్ పై వచ్చిన 17 ఆరోపణలపై నాటి ఐ.జి. నవీన్ చంద్ చేసిన విచారణ నివేదిక దొరకడం లేదని నిసిగ్గుగా ప్రభుత్వం తేల్చిచెప్పింది. (ఆ నివేదికను ఓ జర్నలిస్ట్ సంపాదించారని వినికిడి. అందులో దిగ్భ్రాంతి చెందే విషయాలున్నట్లు తెలిసింది.) దీనిపై హైకోర్టులో వాజ్యం ( WP:200/2018) దాఖలైంది.
 ఈకేసు ఇప్పట్లో విచారణకు రాదని.. "2025 తరువాతననే" అని ఓ వర్గం బల్లాలు గుద్ది మరీ చెప్పింది. అయితే ఊహించని రీతిలో సోమవారం హైకోర్టు విచారణకు వచ్చే కేసుల జాబితాలో లిస్ట్ అయింది. ఈ.విషయంపై కేంద్ర నిఘా వర్గాలు కన్నేశాయి. ఇదిలా ఉండగా మరో ఐ.పి.ఎస్ మీద న్యాయస్థానం స్వీయ విచారణ చేయాలనే కేసు..  'సుప్రీంకోర్టు' ఇటీవల వెలువరించిన తీర్పు నకలు కోసం వేచి చూస్తోంది.

ఈ విషయాలు రాబోయే రోజులలో పత్రికలలో ప్రధాన శీర్షికలకు రంగం సిద్దమైంది. మరి తెలుగు రాష్ట్రాల పోలీసు బాసులు వీడియో, డాక్యుమెంటరీ ఆధారాలతో పక్కాగా దొరికిన అధికారులపై' ఎలా వ్యవహరిస్తారనేది పరిశీలకుల ఆసక్తి.

పత్రికలకు అందని వార్తలు:

'గోల్డెన్ నీ' వచ్చేసింది:
మోకాళ్ల మార్పిడిలో పూర్తి సురక్షిత 'గోల్డెన్‌ నీ' అనే కృత్రిమ మోకాళ్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా కీళ్ల మార్పిడికి కోబాల్ట్‌, క్రోమియం మిశ్రమ లోహాలతో తయారు చేయడం, సాంకేతిక కారణాలతో ఒక శాతం నికెల్‌ కూడా ఇందులో వినియోగిస్తారు. దీనివల్ల కొందరు ఎలర్జీకి లోనయ్యే అవకాశం ఉంది. 'గోల్డెన్‌ నీ'లో ఆ ఇబ్బంది ఉండదు. 
అమెరికా వైద్యుడు డాక్టర్‌ డార్నేల్‌ విశాఖపట్నం క్యూ1 ఆసుపత్రిలో మొదటి శస్త్రచికిత్సను గురువారం నిర్వహించారు.

అల్లనేరేడు చెట్టుకు నూరేళ్లూ నిండాయి!
నూరేళ్లు నిండడమంటే ఇదేనేమో..
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని గిడుగు రామ్మూర్తి భవనానికి సమాంతరంగా మరో నూతన పరిపాలన భవనం నిర్మాణానికి అడ్డుగా ఉందని ట్రీ రీప్లాంటేషన్‌ సంస్థ గ్రీన్‌ మార్నింగ్‌ ద్వారా ఆ వందేళ్ల నాటి అల్లనేరేడు చెట్టును ఉన్న చోట నుంచి తొలగించి వర్సిటీ ప్రాంగణంలోని క్యాంటీన్‌కు దగ్గరల్లో పునః ప్రతిష్ఠించారు. ఇందుకు సుమారు రూ.60 వేల వరకు ఖర్చు అయ్యింది. కొద్ది రోజులకే చిగురు వస్తుందని, మళ్లీ రుచికరమైన పండ్లను ఇస్తుందని ట్రీ ప్లాంటేషన్‌ సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇప్పుడా వందేళ్ల అల్లనేరేడు చెట్టు పూర్తిగా ఎండిపోయింది. 

చిత్ర సరదాలపై నిషేధం పరదా!
చరిత్ర ప్రసిద్ధిగాంచిన బెంగుళూరులోని లాల్‌బాగ్‌ ఉద్యానవనంలో ఇక నుంచి చిత్ర సరదాల (ఫొటో షూటింగ్‌)ను నిషేధించారు. 

జగన్నాథ రథచక్రాలు:
ఈ ఏడాది పూరీలో జరగనున్న విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్రకు రథాల నిర్మాణ ప్రక్రియ  ప్రారంభమైంది. ఏప్రిల్‌ 18 అక్షయ తృతీయ రోజున రథాల తయారీ పనులు ప్రారంభిస్తారు.

కవలల పెళ్లికి కవలల ఫొటోగ్రాఫర్లు..

కాజీపేట సోమిడి ప్రాంతానికి చెందిన కుమారస్వామి, కవిత దంపతుల కవల కూతుళ్లు రమ, లతల వివాహాలు గురువారం హన్మకొండలో ఒకే వేదికపై జరిగాయి. ఆసక్తి కలిగించే విషయమేమంటే ఈ వివాహాన్ని షూట్‌ చేయడానికి వచ్చిన ఫొటో, వీడియోగ్రాఫర్లు రాము, శివ ఇద్దరూ కవలలే. వివాహానికి హాజరైన వారంతా వీరిని ఆసక్తిగా చూశారు. ఆ కవలలను వివాహం చేసుకున్న ఇద్దరి పేర్లు రాజేష్‌  కావడం విశేషం.
మహిళా మిత్రగా అవార్డు..
బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మంగమ్మ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజీపీ మాలకొండయ్య నుంచి మహిళామిత్ర అవార్డు అందుకున్నారు.
ఎబ్బెట్టుగా అనిపించిన బంగి నిరసన..
ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కర్నూలు మాజీ మేయర్‌, తెదేపా నాయకుడు బంగి అనంతయ్య మహిళా దినోత్సవం రోజున మహిళా వేషంలో వినూత్న రీతిలో నిరసన తెలియజేయాలనుకున్నారు. అయితే అది ఎబ్బెట్టుగా ఉందని ఆయనతో పాల్గన్నవారే చెప్పడం జరిగింది.
                                                               -- విశ్లేషణ:అనంచిన్ని వెంకటేశ్వరరావు,(9440000009)

Related Posts