రాజకీయ నాయకులు శత్రువుల్లా ఉండకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధుల పని తీరు ప్రజల ముందు పెట్టాలని ఆయన అన్నారు. అసెంబ్లి, పార్లమెంటు సమర్థంగా పని చేయాలని ఆయన అన్నారు. మంగళవానం నాడు అయన విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా విజయవాడ గేట్వే హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సభలో వెంకయ్య మాట్లాడుతూ జీవితంలో తాను ఉన్నత స్థాయికి రావడానికి పార్టీయే కారణమని న చెప్పారు. ప్రజలు కలవడం తనకెంతో ఇష్టమైన అంశమని ఆయన చెప్పారు. పదవి పెద్దది, అయినా జనం తో దగ్గర కాలేక పోయాం. ఉపరాష్ట్రపతి పదవిని జనం తో దగ్గర కు చేరుతున్నాను. ఉపరాష్ట్రపతి పదవికి సెలవు లేదు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఐదు రంగాలు ఎంచుకున్నాను. రైతు కుటుంబం నుంచి వచ్చానని అన్నారు. రెండేళ్ళ లో సమర్ధవంతంగా నిర్వహించాను. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి దౌత్య సంబంధాలు బలోపేతం చేసాను. 22 దేశాలు తిరిగానని అన్నారు. దేశం ఆర్థికం గా ఎదుగుతుండటం తో గుర్తింపు వచ్చింది. ఇటీవల రాసిన లెర్నింగ్ అనే పుస్తకం వ్రాసి చెన్నై లో ఆవిష్కరించానని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావులు పాల్గొన్నారు.