YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సెలబ్రటీలకు తప్పని దొంగల బెడద

 సెలబ్రటీలకు తప్పని దొంగల బెడద

అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అంత్యక్రియలకు భారీ సంఖ్యంలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివచ్చారు. గత ఆదివారం (ఆగస్టు 25న) ఢిల్లీలోని యమునా నది తీరంలో ఉన్న నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో అధికార లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు కన్నీడి వీడ్కోలు పలికిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బాధగా తమ నేతకు తుది వీడ్కోలు పలుకుంతుంటే కొందరు తమ బుద్ధి చూపించారు. జైట్లీ సన్నిహితులు, బంధువులంతా అంత్యక్రియల పనులు నిర్వహిస్తుంటే చోరీకి పాల్పడ్డారు. కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో సహా 11 మంది సెల్ ఫోన్లు చోరీ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు బాబుల్‌ సుప్రియో, సోమ్‌ ప్రకాశ్‌, సుప్రియో కార్యదర్శి సహా మరికొందరి ఫోన్లు జైట్లీకి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో చోరీకి గురయ్యాయి. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీ ఘటనపై తిజరావాలా ఎస్కే ట్వీట్ చేశారు. ‘నిగమ్ బోధ్ ఘాట్‌లో మాజీ మంత్రి జైట్లీకి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బాబుల్ సుప్రియో సహా 11 మంది సెల్ ఫోన్లు చోరీకి
గురయ్యాయని’ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా, ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం తన ఫోన్ ఈ లోకేషన్‌లో ఉందని సైతం పేర్కొంటూ తిజరావాలా ట్వీట్లు చేయడం గమనార్హం. కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో సైతం ఫోన్ల చోరీపై ఘాటుగా స్పందించారు. ‘నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో జనాలు గుమిగూడి ఉన్న చోటుకి నేను కూడా వెళ్లాను. ఆ సమయంలోనే నా ఫోన్‌ చోరీ అయింది. ఓకే చోట దాదాపు ఆరుగురి ఫోన్లు చోరీ అయ్యాయి. మొత్తంగా చెప్పాలంటే 35 మంది ఫోన్లు చోరీకి గురై ఉండొచ్చునని’ బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. 10-15 నిమిషాలకొకరు తమ ఫోన్ పోయిందని అరిచారు.

Related Posts