
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ చోరీ ఘటన కలకలం రేపింది. పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి బంధువు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఉత్తమ్‌కుమార్ అనే బిల్డర్ బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో గల జపనీస్ పార్క్ సమీపంలో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి ఆయన ఇంట్లోకి చొరబడిన దొంగలు సుమారు రూ.3కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించుకుని పోయారు.ఉదయం ఆభరణాలు మాయం కావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వాటిలో వజ్రాలు, బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఇది తెలిసిన వారి పనేనా? లేక దొంగల ముఠా పనా? అన్న కోణంలో విచారిస్తున్నారు.