YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం

కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జై జవాన్, జైకిసాన్ తో పాటు జై విజ్ఞాన్ కూడా చేర్చాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం విశాఖలో ఎన్.ఎస్.టి.ఎల్ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎన్ఎస్టిఎల్ లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రతిభ చూపిన శాస్త్రవేత్తలకు, అధికారులకు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరక్షణ పరికరాల తయారీలో ఎన్ఎస్టిఎల్ పాత్రను కొనియాడు తూ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి చంద్రమండలం లోకే కాకుండా సూర్యమండలం లోకి కూడా అడుగుపెడతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పురాతన నాగరికతకు, శాంతి కాముకతకు భారతదేశం ఒక చిహ్నమని భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా వుండేదని మళ్లీ ఆరోజులు రాబోతున్నాయన్నారు. విదేశీభావజాలం నుంచి భారతీయులు బైటపడాలన్నారు. భారత్ కు ఎవరపైనా దాడి చేసే స్వభావంలేదని, ఇతరులు మన సొంత విషయాలజోలికి వస్తే గట్టిగానే బుద్ది చెపుతామన్నారు. జమ్ము కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. కాశ్మీర్కు సంబంధించినంత వరకూ అది భారత్ అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. పాకిస్తాన్తో ఒకవేళ చర్చలు జరిపితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) అంశంపైనేనని ఆయన స్పష్టం చేశారు. . 2/3 వంతు మెజార్టీతో లోక్సభలో, 4/5 వంతు మెజార్టీతో రాజ్యసభలో నెగ్గి కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేసుకున్నామన్నారు. ఈసందర్భంగా ఎన్.ఎస్.టి.ఎల్ గోల్డెన్ జర్నీ పై ఫోటో ఎస్సే ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అలాగే సహాయక్ ఎన్.జి సిస్టమ్ ను నావికాదళానికి అందజేశారు.

Related Posts