YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతం చేస్తా: చంద్రబాబు

తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతం చేస్తా: చంద్రబాబు

త్వరలో తెలంగాణలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తాను ముందు చూపుతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పారు. హైదరాబాద్‌‌లో ఎయిర్‌పోర్టుకు అంత భూమి ఎందుకని ఎగతాళి చేశారన్నారు. కానీ ఇప్పుడు దేశంలోనే మంచి ప్రమాణాలు కలిగిన ఎయిర్‌పోర్టుగా పేరు గాంచిందని గుర్తుచేశారు. తాను చేసిన అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారాయని స్పష్టం చేశారు. తాను ఏది చేసినా.. అది సమాజం కోసం.. భవిష్యత్ తరాల కోసమేనన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీలు మొత్తం హైదరాబాద్‌కు వచ్చాయని పేర్కొన్నారు. దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి తెచ్చానని వెల్లడించారు. ప్రజలకు మంచి పనులు చేయబట్టే.. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు సీఎంగా పదేళ్లు ప్రతిపక్ష నేతగా కొనసాగిన ఏకైక నేతగా తనకు పేరుందన్నారు. రాష్ట్ర విభజన
తర్వాత ప్రజలు తనపై నమ్మకంతోనే నవ్యాంధ్రకు సీఎంగా చేశారన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ తరహాలో అమరావతికి శ్రీకారం చుట్టామన్నారు. కానీ ఇప్పుడు అమరావతి డైలమాలో పడ్డాదని చెప్పారు. ఒక్క అవకాశం అంటూ అందలం ఎక్కి.. మూడు నెలల్లోనే ఏపీని అంధకారంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఏపీలో మిగులు విద్యుత్ తానిస్తే.. ఇప్పడు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. అమరావతి కాన్సెప్ట్‌నే చంపేసే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిస్తే.. వారి త్యాగాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కొనసాగడం చారిత్రక అవసరమైయిందని తెలిపారు. జగన్ అమరావతిని దెబ్బ తీయడంతో ఇప్పుడు అందరూ హైదరాబాద్‌కు వలస వెళ్లిపోతున్నారని చెప్పారు. తాను ఆశా జీవిని.. అధైర్యపడకుండా ముందుకు సాగుతానని నేతలకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Related Posts