2..3 రోజుల్లోనే మార్పులు రాజ్యసభకు నరసింహారెడ్డి
ఆయన స్థానంలో మహిళ
పద్మ.. లేదా ఉవులలో ఒకరు
స్వామిగౌడ్‌కూ మంత్రి అవకాశం
కాకుంటే శ్రీనివాసగౌడ్‌కు చాన్స్
స్వల్ప మార్పులకే కేసీఆర్ మొగ్గు
ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాల నేపథ్యంలో.. తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లోనే ఈ మార్పులు జరగొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా.. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆయునను పెద్దల సభ అయిన రాజ్యసభలకు పంపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో మహిళా మంత్రి ని తీసుకోవచ్చని అంటున్నారు. ప్రధానంగా.. ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి... లేకుంటే నల్లగొండ జిల్లాలో మంచి పట్టున్న మాజీ మంత్రి, ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఉమా మాధవరెడ్డి లలో ఒకరికి చాన్స్ రావచ్చం టున్నారు. తొలిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడు తున్నందున తప్పనిసరిగా మహిళను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని గట్టిగా చెబుతున్నారు.
ఈ విషయంలో ముఖ్య మంత్రిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా దీంతో ఫుల్‌స్టాప్ పెట్టవచ్చని పార్టీవర్గాలు అభిప్రాయపడు తున్నాయి. బుధవారం తన వ్యవసాయ క్షేత్రం లో బసచేసిన కేసీఆర్... అక్కడే మంత్రి వర్గంలో మార్పులపై కసరత్తు చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల్లో మంచి పట్టున్న స్వామి గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసు కుంటారని కథనాలు వినవస్తున్నాయి. అయితే.. శాసనమండలి చైర్మన్‌గా ఆయన మంచి హోదాలోనే ఉన్నందున ఆయనకు బదులు మ రో ఉద్యోగ సంఘ నాయకుడు శ్రీనివాస్ గౌడ్‌ను తీసుకోవచ్చని కూడా టీఆర్‌ఎస్ వర్గాలు చెబు తున్నాయి. ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అనేక ఆరో పణలు వచ్చిన మంత్రి అజ్మీ రా చందూలాల్ స్థానంలో రెడ్యానాయక్‌ను తీసు కునే అవకాశం ఉంది. ఒకవేళ స్వామిగౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే శాసన మండలి చీఫ్ విప్‌గా ఉన్న పాతూరి సుధాకర్‌రెడ్డిని మం డలి చైర్మన్‌గా చేయవచ్చు. మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండకపోవచ్చని, స్వల్ప మార్పు లతోనే సరిపెట్టే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.