Highlights
- రోగికి తలగడగా తోలగించిన కాలు
- ఆగ్రహించిన బంధువులు
యూపిలోని ఝాన్సీ మెడికల్ కాలేజీ వైద్యులు చేసిన ఘనకార్యాన్ని చూసినవాళ్లంతా ముక్కిన వేలేసుకుంటున్నారు. ఓ ప్రమాదంలో గాయపడి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన రోగికి తోలగించిన అతని కాలునే తలగడగా మార్చారు. అసలేం జరిగిందంటే..విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆ బస్సులో హెల్పర్‌గా పని చేస్తున్న జ్ఞాన్‌శ్యామ్(25)తో పాటుగా 25 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని చికిత్స నిమిత్తం ఘనతవహించిన ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ జ్ఞాన్‌శ్యామ్‌కు శస్త్ర చికిత్స చేసి అతని కాలును తొలగించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత కాలును శ్యామ్ తల కింద దిండుగా అమర్చారు.
దీన్ని గుర్తించిన శ్యాం బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. శ్యామ్ తల కింద దిండు పెట్టాలని బంధువులు కోరగా.. ఆస్పత్రి సిబ్బంది పెడచెవిన పెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో సంబంధిత ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.