మహిళలకు కేంద్రం శుభవార్త వెల్లడించింది. మహిళల పరిశుభ్రత కోసం ఇక నుంచి కేవలం రూపాయి ధరకే శానిటరీ ప్యాడ్ లను జన ఔషధి స్టోర్ల ద్వారా అందించాలని కేంద్రం నిర్ణయించింది.పలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు రుతుస్రావం సమయంలో ఇప్పటికీ చిన్న బట్టముక్కలు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళల పరిశుభ్రత కోసం, వారికి వ్యాధులు దరిచేరకుండా ఉండేలా సువిధ బ్రాండు శానిటరీ ప్యాడ్లను రూపాయికే అందించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల పలువురు బాలికలు పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేస్తున్నారు. తాము రుతుస్రావం సమయంలో పాఠశాలకు వెళ్లడం లేదని 28 శాతం మంది బాలికలు చెప్పారు. దీంతో మహిళలు బాలికలకు నామమాత్రపు ధరతో శానిటరీ ప్యాడ్లను అందించాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర సహాయమంత్రి మన్సూఖ్ మాండవీయ చెప్పారు. జనఔషధి స్టోర్లను గుర్తించేందుకు వీలుగా జనఔషధి సుగం మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించారు. ఈ స్టోర్లలో జనరిక్ మెడిసిన్ తో పాటు శానిటరీ ప్యాడ్లను తక్కువ ధరలకు అందించనున్నారు.