YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ముందస్తు ఎన్నికలకు తెరతీసిన టీఆర్ఎస్ 

Highlights

  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 106 సీట్ల లక్ష్యం
  • సిట్టింగ్ అభ్యర్థుల స్థానాలు పదిలం
  • ప్రతిపక్షాలతో మైండ్ గేమ్ 
  • టీఆర్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ 
ముందస్తు ఎన్నికలకు తెరతీసిన టీఆర్ఎస్ 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందస్తుగానే ఎన్నికల వ్యూహాలకు తెర తీశారు. మిలీనియం మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహణను పోలీసు బలంతో అప్రజాస్వామికంగా అణచివేశారని రాష్ట్రంలోని ఒక వర్గం బాహాటంగానే విమర్శిస్తుండగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 106 సీట్లు గెలుచుకొంటుందని సీఎం కేసీఆర్  విశ్వాసం వ్యక్తం చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అలాగే తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం, ఖాయమని మరోసారి ప్రకటించి టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపారు. అనేక పోరాటాల తరువాత వచ్చిన రాష్ట్రానికి తొలిసారిగా నాయకత్వం వహిస్తున్న పార్టికి ఎంతో కొంత ఎదురుగాలి వీయడం తప్పదనే విశ్లేషణలు జోరుగా ఉన్న తరుణంలోకేసీఆర్ తమ గెలుపు పై ధీమా వ్యక్తం చేయడం కేవలం ప్రతిపక్షాలతో మైండ్ గేమ్ ఆడుకోవడమే అని కొందరు భావిస్తుండగా, ఎన్నికల సంవత్సరం కావడం వల్ల స్వంత పార్టీ వారికి నైతికంగా  ఆత్మ స్థైర్యం కల్పించడానికే ఇప్పుడు ఈ సర్వ్వే ఫలితాలను కేసీఆర్ బయటకు తీశారని ఒక వర్గం చెప్పుకోస్తోంది.అయితే మూడు రకాల సర్వేల్లో ఇదే రకమైన నివేదికలు వచ్చాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లో కూడ కీలక పాత్ర పోషించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించిన దరిమిలా వచ్చే ఎన్నికల్లో తమ పార్టికి తిరుగులేదని ప్రకటించారు. తాము జరిపించిన మూడు సర్వేల్లో కూడా ఇదే విధమైన ఫలితాలు సూచిస్తున్నాయంటూ పార్టీ శ్రేణుల్లో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం టిఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేందరికీ వచ్చే ఎన్నికల్లో తప్పక అవకాశం ఇస్తామని చెప్పి ఆయన సభ్యులను ఆనందం లో ముంచెత్తారు. సోమవారం నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కెసిఆర్ సభ్యులతో చర్చించారు. అదే విధంగా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ , బడుగుల లింగయ్య యాదవ్ బండ ప్రకాష్‌ ముదిరాజ్  పేర్లను టీఆర్ఎల్పీ సమావేశంలోకేసీఆర్ ప్రకటించారు. చివరికి బాష రాని వారితో కూడ సర్వే నిర్వహించినప్పుడు కూడ ఇవే ఫలితాలు
వచ్చాయని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో ఢోకా లేదని కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు భరోసాను ఇచ్చారు. సిట్టింగ్‌లకు టిక్కెట్లు. జాతీయ రాజకీయాల్లో తాను క్రియా శీలక పాత్ర పోషించనున్నట్టు తెలంగాణ సీఎం కెసిఆర్ మరోసారి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో వుండే డిల్లీ లో రాజకీయాలు నడిపిస్తాననని జాతీయ రాజకీయాలపై తన పాత్ర గురించి టీఆర్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ది దేశ రాజకీయాల్లో చర్చకు తెరలేపుతోందని అయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ తోసహ ఇతర పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టినా పార్టీ అభ్యర్ధుల గెలుపును అడ్డుకోలేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

                                                                                   - పి.వి.భరత్ మోహన్,  విశ్లేషకులు 

Related Posts