YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రాజ్యసభ ఎన్నికల్లో అగ్రవర్ణాలకు తాంబూలం 

Highlights

  • కమ్మ, వెలమలకే 'చంద్రన్న' కానుక! 
  • ఎస్సి, మైనార్టీలకు మొండి చేయి చూపిన  
  • తెలుగు దేశం పార్టీ అధిష్టానం
రాజ్యసభ ఎన్నికల్లో అగ్రవర్ణాలకు తాంబూలం 

రాజ్యసభ సీట్లకు తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఆయన నిర్ణయించిన అభ్యర్థుల పేర్లను తెలియజేస్తూ.. ఏక వాక్యంతో కూడిన పత్రికా ప్రకటనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విడుదల చేశారు. 
‘‘చంద్రబాబునాయుడుగారి నిర్ణయం మేరకు రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్ మరియు కనకమేడల రవీంద్రకుమార్ లను ప్రకటించడం జరిగింది’’ అనే ఏకవాక్యంతో ప్రతికా ప్రకటన వచ్చింది. దీనిమీద పార్టీలోనే ఉవ్వెత్తున సెగలు పొగలు రేగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సీఎం రమేష్ మరియు వర్ల రామయ్యలను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. వర్ల రామయ్య టీవీ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల ద్వారా... తనను ఎంపీ చేసినందుకు చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు కూడా తెలియజేసేశారు. కానీ మధ్యాహ్నానికి అధికారక ప్రకటన వచ్చేసిరికి తేడా కొట్టింది. అధినేత తీసుకున్న నిర్ణయం మీద పార్టీ వర్గాల్లోనే విపరీతమైన అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. అగ్రవర్ణాల నుంచి ఒకరిని, దళిత, బీసీ వర్గాలనుంచి ఒకరిని ఎంపిక చేస్తానని నిన్నటి దాకా పార్టీ సీనియర్లతో చర్చిస్తూ వచ్చిన చంద్రబాబు హఠాత్తుగా రెండు సీట్లను అగ్రవర్ణాల వారికే ఇవ్వడం పార్టీలో చాలా మందికి మింగుడుపడడం లేదు.


కనకమేడల రవీంద్రకుమార్ అంటే ప్రాక్టీసింగ్ న్యాయవాది. తెలుగుదేశానికి అనుకూలమైన వ్యక్తి. కమ్మవర్గానికి చెందిన నాయకుడు. చంద్రబాబు కుటుంబంతో చాలా కాలంగా సాన్నిహిత్యం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రమేష్ సంగతి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. చంద్రబాబుకు సంబంధించి.. ఎంత రహస్యమైన లాబీయింగ్ పనులైనా సీఎం రమేష్ చేతుల మీదుగా జరుగుతూ ఉంటాయనే ప్రచారం పార్టీలోనే ఉంది. ఇలా పార్టీకి దక్కిన రెండు సీట్లను అగ్రవర్ణాలకే కట్టెబడితే.. మాట తప్పినట్లు అవుతుంది కదాని.. పార్టీ నాయకులే అనుకుంటున్నారు.

                                                                                                - పి.వి.భరత్ మోహన్,  విశ్లేషకులు 

Related Posts