YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గాడిన పడుతున్న రైల్వేలు

 గాడిన పడుతున్న రైల్వేలు

యువ న్యూస్ జనరల్ బ్యూరో:

రైల్వేలు నెమ్మది నెమ్మదిగా ప్రైవేటు పట్టాలెక్కే ప్రయత్నాలు మొదలైంది. అయితే.. దీనికి ముందు కొన్ని శుభవార్తలు ప్రయాణికులకు రైల్వేశాఖ చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రైలు ఆలస్యంగా నడిస్తే.. ప్రయాణికులకు నష్టపరిహారం అందుతుందని.. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. రైలు తాను చేరాల్సిన గమ్యస్థానానికి గంట కంటే ఎక్కువ ఆలస్యంగా నడిచినపక్షంలో కొంత మొత్తాన్ని పరిహారం కింద.. ప్రయాణికుల ఈ వాలెట్ కు తిరిగి ఇవ్వాలన్న విధానం అమల్లోకి తేనున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. దేశంలో తొలి ప్రైవేటు రైలును ఐఆర్ సీటీసీ నడిపించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ - లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును తొలి దేశీయ ప్రైవేటు రైలుగా చెబుతున్నారు. దీనికి ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణకు అనుగుణంగా ముంబయి-అహ్మదాబాద్ మధ్య కూడా రైలును నడపనున్నారు. ఈ రైళ్లు విమాన ఛార్జీల కంటే తక్కువ ధరకు లభించే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తేజస్ రైళ్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాయితీలు ఏమీ అమలు కావని చెబుతున్నారు. పిల్లలకు ఫుల్ టికెట్ తీసుకోవాలని.. సీనియర్ సిటిజన్లు మొదలుకొని వివిధ వర్గాల వారికి ఇచ్చే రాయితీలేవీ ఈ రైళ్లకు ఇవ్వరని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రైళ్లలో టికెట్ ధరలు ఎంత ఉండాలన్న విషయంలో ఐఆర్ సీటీసీకి తగినంత స్వేచ్ఛ ఇస్తారట. ఈ రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ బీమా సౌకర్యాన్ని ఇవ్వనున్నారు. ప్రస్తుతం 53 విభాగాల్లో ఇచ్చే రాయితీల్ని ఈ రైల్లో ప్రయాణించే వారికి వర్తించవని స్పష్టం చేస్తున్నారు. సో.. రానున్న రోజుల్లో ప్రైవేటు రైళ్లకు పెద్దపీట వేసి.. ప్రభుత్వ రైళ్లను పక్కన పెడితే.. సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపించటం ఖాయం.

Related Posts