YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

ఢిల్లీ లో చక్రం తిప్పిన జగన్

ఢిల్లీ లో చక్రం తిప్పిన జగన్

ఇటీవల ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన జగన్ కేంద్రమంత్రులు అమిత్ షా, జలశక్తిమంత్రి గజేంద్ర షెకావత్ తో ఏపీ లో విద్యుత్ కొనుగోళ్లు పీపీఏ ల రద్దుపై , విద్యుత్ కొనుగోళ్ల లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇచ్చిన వివరణతో  కేంద్రం ఏకీభవించినట్టే కనిపిస్తుంది. దీంతో ఢిల్లీలో  చక్రం తిప్పిన  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు టిడిపి అండ్ కో విల విల విల్లాడుతుంది.  నిన్నమొన్నటి వరకు విద్యుత్ పీపీఏ లపై రద్దుపై నానా రాద్ధాంతం చేసిన ప్రతిపక్షపార్టీలకు కేంద్రం చెంప చెళ్లుమనిపించింది. తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ పీపీఏల రద్దుపై కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూలంగా కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేసింది.జగన్ ఢిల్లీ పర్యటన ముందు వరకు రాష్ట్రంలో వున్నా టిడిపి కూడఁరంలో అధికారంలో వున్నా భాజపా వాళ్ళు కూడా పీపీఏ ల రద్దుపై ఎవరికి ఇస్టమావోచ్చినట్టు మాట్లాడారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావు ,ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం తీసుకున్న నిర్ణయం  సరైంది కాదని సాక్షాత్తు కేంద్ర జల మంత్రి గజేంద్ర షెకావత్ దుయ్యబట్టటారు. పిపిఏల సమీక్ష వల్ల రాష్ట్రాభివృద్ది ఆగిపోతుందని, పారిశ్రామికవేత్తలు వెనక్కుపోతారంటూ కేంద్ర ఇంధన కార్యదర్శి నానా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. .ఈయాన చేసిన వ్యాఖ్యలు టిడిపి కి అనుకూలంగా మారాయి. ఈదెబ్బతో టిడిపి అనుకూల మీడియా జగన్ ప్రభత్వం పై ప్రత్యక్షంగా పరోక్షంగా నానా రాతలు రాసారు. అయితే యితే పిపిఏల సమీక్షలపై కోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగితే వాటిని రద్దు చేయటంలో తప్పు లేదని చెప్పడంతో  టిడిపి నాయకులకు మతి పోయినట్టనిపించింది.పిపిఏలను దుర్వినియోగం చేశారని ఆధారాలు లభించినపుడు వాటిని రద్దు చేయవచ్చని కూడా అంగీకరించింది. పిపిఏలను రద్దు చేయటమే కాకుండా క్రిమినిల్ ప్రాసిక్యూషన్ కు చర్యలు కూడా తీసుకోవచ్చని అంగీకరించింది. చంద్రబాబునాయుడు హయాంలో వివిధ కంపెనీలతో చేసుకున్న పిపిఏ ల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారు. అందుకనే సిఎం కాగానే నిపుణుల కమిటి వేశారు. కమిటి కూడా అవినీతి జరిగిందనే నిర్ధారించింది.

Related Posts