YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

'రాజధానిపై జగన్ క్లారిటీ ఇవ్వాలి'

'రాజధానిపై జగన్ క్లారిటీ ఇవ్వాలి'

రాజధాని మార్పు అంశం తెర మీదకు వచ్చిన వేళ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో పర్యటిస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులతో మాట్లాడిన పవన్.. రాజధాని మార్పు విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని అనేది భావోద్వేగపరమైన అంశమన్న జనసేనాని.. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం జరగాలి, మంచి రాజధాని కావాలన్న జనసేనాని.. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలోనూ చాలాసార్లు రైతులు నన్ను పిలిచారన్న జనసేనాని.. వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తే ఉద్ధండ్రాయుని పాలెంకు నన్ను పిలిచారని గుర్తు చేశారు. ప్రజల్ని మీరు పట్టించుకోకపోతే.. మేం అండగా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

బలవంతంగా భూములు లాక్కుంటే నిరసన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించామని పవన్ గుర్తు చేశారు. రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని, పనులు ప్రారంభించాక.. మళ్లీ మారుస్తామంటే గందరగోళం నెలకొంటోందన్నారు. రాజధానిని అమరావతిలో ఉంచుతారా? ఉంచరా? అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేనాని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచదల్చుకోపోతే అందుకు తగిన కారణాలు చెప్పాలన్నారు. అక్రమాల పేరిట రైతుల పొట్ట కొట్టడం సరికాదన్న పవన్.. గత ప్రభుత్వం ఏవైనా తప్పిదాలు చేస్తే విచారించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. జగన్ మాట వినకపోతే మోదీ, అమిత్ షా దగ్గరకు వెళ్తానని పవన్ హెచ్చరించారు. రాజధానిపై పవన్ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారన్న బొత్స వ్యాఖ్యల పట్ల జనసేనాని స్పందించారు.

బొత్స తెలుసుకొని మాట్లాడాలన్న జనసేనాని.. అప్పుడు, ఇప్పుడు ఒకేలా మాట్లాడుతున్నానని తెలిపారు.బలవంతంగా భూములు లాగేసుకోవద్దని గతంలో చంద్రబాబు సర్కారుకు సూచించా.. జగన్ సర్కారు జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ప్రజలపై ఆదరాభిమానాలను చూపించండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఇవాళ్టికి 90 రోజులు. వంద రోజుల వరకు మౌనంగా ఉండాలని భావించాం. కానీ ప్రభుత్వం ప్రజలను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతోనే జనాల్లోకి వచ్చాం. టీడీపీ ఇసుకను అమ్ముకుంటే.. మీరు కూడా రాత్రి పూట ఇసుక అమ్ముకుంటున్నారు. టీడీపీకి, మీకు తేడా ఏంట''ని వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అవసరమైతే మోడీతో భేటీ

ఏపీ రాజధాని అమరావతిని మారుస్తారని అనుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని మారిస్తే ప్రధానిని కలుస్తానని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాజధాని తరలిస్తారా లేదా అనేది సీఎం జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని మార్పు విషయంలో లీకులు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. రాజధానిపై మంత్రుల ప్రకటనలతో గందరగోళం నెలకొందన్నారు. రాజధాని విషయంలో అవినీతి జరిగితే విచారణ జరపాలన్నారు.28 వేల మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని తెలిపారు. 10 వేల మంది రైతుల ఆరు వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మారిస్తే పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల సంగతేంటన్నారు. కేంద్ర నిధులిచ్చింది అమరావతికి అంతేకాని రాజధాని మారుస్తామని గందరగోళం చేయడం సరికాదన్నారు.రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టం పోయామని, ఎన్నో అవమానాలు పొందామన్నారు. పార్టీలుగా విభేదించవచ్చు గానీ, ప్రజా సమస్యల పట్ల మెజారిటీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని అమలు చేయాలన్నారు. ఒకవేళ రాజధాని మార్చే పరిస్థితి వస్తే జనసేన రైతుల పక్షాన ఉంటుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసినప్పుడు వారికి అండగా నిలబడ్డామని తెలిపారు.

ఇప్పుడు కూడా రాజధాని రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్‌ కళ్యాణ్ కలిశారు. రాజధాని తరలించకుండా చూడాలని వారు కోరారు. దీనిపై స్పందించిన జనసేనానీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్ట్ 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. గత పాలకులు అవకతవకలకు పాల్పడి ఉంటే.. వాటిని సరిదిద్దుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదు.. రాష్ట్రమంతటిది అన్నారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని పవన్ హామీనిచ్చారు.

 చెప్పులు బహూకరించిన అభిమాని

ఎన్నికల్లో జనసేన అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి కేవలం ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటికీ యువతలో పవన్ కళ్యాణ్ పట్ల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. జనసేనాని అమరావతి ప్రాంత పర్యటన సందర్భంగా ఈ విషయం రుజువైంది. రెండ్రోజుల అమరావతి పర్యటన కోసం.. పవన్ పార్టీ కార్యాలయం నుంచి మంగళగిరి పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. స్థానికులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ అభిమాని తాను తయారు చేసిన జనసేనాని చెప్పులను బహుకరించాడు. తాను ఇచ్చిన చెప్పులతోనే అమరావతిలో పర్యటించాలని కోరాడు. అతడి అభిమానానికి ముచ్చట పడిన పవన్.. నవ్వుతూ చెప్పులు తీసుకున్నారు. అక్కడి నుంచి అభిమానులతో కలిసి ర్యాలీగా రాజధాని అభివృద్ధి పనుల్ని సమీక్షించడానికి వెళ్లారు. నిడమర్రులోనూ పర్యటించిన పవన్ అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కొండవీటి వాగుపై నిర్మిస్తోన్న బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు.

Related Posts