YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

'తుగ్లక్ పరిపాలనకు 3 నెలలు'

'తుగ్లక్ పరిపాలనకు 3 నెలలు'

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి (ఆగస్టు 30) నాటికి సరిగ్గా 3 నెలలు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగింది. ప్రభుత్వమే ఇసుక కొరత సృష్టించిందని ఆరోపిస్తూ.. టీడీపీ నేతలు రోడ్లెక్కారు. ఈ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నేతగా ఆయన బయటకు రాలేదు.
ఇసుక కొరత పట్ల ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. నారా లోకేశ్ తొలిసారి జనంలోకి వచ్చారు. మంగళగరిలో నెత్తి మీద ఇసుక ఎత్తే బొచ్చె పెట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. భారతీ సిమెంట్ బస్తా రూ. 360, భారతీ ఇసుక బస్తా రూ.400 అంటూ చేతిలో ప్లకార్డు పట్టుకొని ఆయన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ మంగళగిరిలో తెలుగుదేశం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాను. తుగ్లక్ పరిపాలన గురించి గతంలో విన్నాం.. ఇప్పుడు @ysjagan గారి రూపంలో ప్రత్యక్షంగా చుస్తున్నాం.ఇసుక కొరత వల్ల కార్మికులందరూ పనుల్లేక రోడ్డున పడ్డారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుడికీ ప్రభుత్వం రూ. 60 వేల ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలి. #NoSandNoWorkInAP

తుగ్లక్ పరిపాలన గురించి గతంలో విన్నాం.. ఇప్పుడు జగన్ రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని లోకేశ్ సెటైర్లు వేశారు. ఇసుక కొరత వల్ల కార్మికులందరూ పనుల్లేక రోడ్డున పడ్డారన్న లోకేశ్... ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుడికీ ప్రభుత్వం రూ. 60 వేల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

విజయసాయి  సెటైర్లు

చంద్రబాబు, లోకేష్, టీడీపీపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి ట్వీట్ల దాడి కొనసాగుతోంది. వైసీపీ సర్కార్‌పై ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ఎంపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అంశాలవారీగా బాబు అండ్ కోపై విరుచుకుపడుతున్నారు. తాజాగా గ్రామ వాలంటీర్లపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఇంకా ఐదేళ్లలో చూడాల్సి చాలా ఉంది లోకేష్ బాబు అంటూ చురకలంటించారు. 'గ్రామ సచివాలయాలు,వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు.రిక్షాలు తొక్కాలని,హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబాబు గారూ. ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు. గుండె రాయి చేసుకోండి లోకేష్ గారూ'అంటూ సెటైర్లు పేల్చారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. గ్రామ సచివాలయాలు,వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు.రిక్షాలు తొక్కాలని,హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు @ncbn గారూ.ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు.గుండె రాయి చేసుకోండి.'టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ ఏపీ ముఖ్యమంత్రి గారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే పెద్ద మనిషి ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి'అని డిమాండ్ చేశారు ఎంపీ.  టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే పెద్ద మనిషి ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి.

Related Posts