బహుశా ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఈ స్థాయిలో హైప్ రాలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం. కొన్ని సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. కానీ, 'బాహుబలి' తెలుగు సినిమా గమనాన్ని మార్చింది. పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. 'బాహుబలి' సిరీస్ ద్వారా ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. అందుకే, 'సాహో' మొదటి నుంచి వార్తల్లో నిలిచింది. విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన బజ్ ఏర్పడింది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'సాహో' సినిమా ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. పాజిటివ్ కామెంట్ల కన్నా.. నెగిటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తోంది. ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు పెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టేంతగా కథ, కథనాలు దీనిలో ఏమున్నాయని అడుగుతున్నారు. అయితే, కొంత మంది మాత్రం సినిమా చాలా బాగుందని.. భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ మూవీ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. సినిమాను ప్రభాస్ తన భుజస్కందాలపై మోశాడని కొనియాడుతున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ అట. అయితే పాటలు, రొటీన్ స్టోరీ, రన్‌టైమ్, పూర్ వీఎఫ్ఎక్స్ సినిమాకు మైనస్ అంటున్నారు. మొత్తం మీద 'సాహో' మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.
ఎత్తేస్తున్న టాలీవుడ్
సాహో' ప్రభాస్ అంటూ ఆహ్వానం పలుకుతోంది టాలీవుడ్. 'బాహుబలి' చిత్రం తరువాత సుమారు రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా సుమారు 10 వేల థియేటర్స్‌లో విడుదల కానున్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'సాహో' చిత్రం కోసం సామాన్య ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ 'సాహో' చిత్రానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ.. నాని, సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, నితిన్, రాహుల్ రవీంద్రన్, యూవీ క్రియేషన్స్ తదితురులు ట్వీట్ చేస్తున్నారు. 'ప్రభాస్ అన్నా.. సుజీత్ అండ్ టీంతో కలిసి రేపు థియేటర్స్‌లో మంట పుట్టించబోతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాను చూసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఇండియాకి రాగానే 'సాహో' చూస్తా' అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నేచురల్ స్టార్ నాని.
రెండు కోట్లకు న్యాయం జరిగిందా
థియేటర్స్‌లో 'సాహో' మేనియా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ థియేటర్స్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల కోలాహలంతో సందడిగా ఉంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉంది? ప్రభాస్ బాహుబలి రికార్డ్‌లను బ్రేక్ చేశాడా? సుజీత్ డైరెక్షన్ బాగుందా? యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? లాంటి చర్చలతో పాటు ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండెజ్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 'సాహో' చిత్రంలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే.. అది ఆమె ప్రభాస్‌తో ఆడిపాడిన బ్యాడ్ బాయ్ సాంగ్. 'సాహో' ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. కాగా ఈ సాంగ్ కోసం ఈ భామ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసాంగ్‌కి రూ. 2 కోట్లా అంటూ చాలా మంది నోరెళ్లబెట్టారు. అయితే ఈ బ్యాడ్ బాయ్ సాంగ్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు జాక్వలిన్ ఫెర్నాండెజ్ అందచందాలకు ఫిదా అవుతున్నారు. తన అందచందాలతో అదరహో అనిపించింది జాక్వలిన్. తన ఒంపుసొంపుల వయ్యారాలతో మెలికలు తిరుగుతూ కనువిందు చేసింది. ప్రభాస్ పక్కన మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఆమెతో పాటు అందమైన మోడల్స్‌తో సాంగ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్‌షా స్వరపరిచారు. నీతి మోహన్‌తో కలిసి ఆయనే ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు. మొత్తానికి తీసుకుంటే తీసుకుంది కాని.. రూ. 2 కోట్లు వాటికి న్యాయం చేసిందనే అంటున్నారు సినీ అభిమానులు.