ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి రాజకీయాలకు పనికిరారని మండలి విప్, టీఆర్ఎస్ నేత బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రేవంత్ చీకటి సెటిల్‌మెంట్లు చేసుకోవడానికి మాత్రమే సరిపోతారని ఆయన
ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డని విమర్శించారు. కేసీఆర్ ఆలోచనతో జెన్‌కో సీఎండీ ఆరునెలల్లోనే విద్యుత్ కొరత తీర్చారని ఆయన అన్నారు.కాంగ్రెస్‌లో
అంతర్గతపోరు ఎక్కువైందని, పీసీసీ పదవి దక్కించుకునేందుకు రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభాకర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ
విద్యుత్ శాఖలో పనిచేశారని బోడకుంటి గుర్తు చేశారు.