YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

మొక్కలను పరిరక్షించాలి

మొక్కలను పరిరక్షించాలి

ప్రకృతి నష్టానికి నరుడే కారణభూతుడవుతున్నాడని ఎక్కడైతే పచ్చదనం వెల్లివిరుస్తుందో ఆయా ప్రదేశంలో ప్రశాంతత నెలకొంటుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించే భాద్యత తీసుకోవాలని

రాష్ట్ర ఆర్ధిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి  పిలుపునిచ్చారు. శనివారం నగర శివారు ప్రాతంలోని సిటి ఫారెస్ట్ లో 70వ వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన

ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పాణ్యం, నందికొట్కూరు, పత్తికొండ ఎమ్మేల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆర్ధర్, శ్రీదేవిలు, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్.పి ఫక్కిరప్ప, అడిషనల్ ఫారెస్ట్

కన్జర్వేటర్ గోపినాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిలో మానవుడు అతిచిన్న శాతమైనప్పటికి నాగరికత పెరిగే కొద్దీ ప్రకృతి నాశనానికి

కారణమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి సంరక్షించే భాద్యత తీసుకోవాలని సూచించారు. గత పది సంవత్సరాల క్రితం కృష్ణా నదిలో 1200 టియంసిల నీరు వస్తే ప్రస్తుతం 600

టియంసిలకు మించి రావడం  లేదన్నారు. జిల్లాల్లో 23 శాతానికి అడవులకు గాను 20 శాతం మాత్రమే వుందని, ఇంకా అరణ్యశాతం పెంచేందుకు ఫారెస్టు అధికారులు చొరవ చూపాలన్నారు.  నగర

వనంలో పచ్చదనం అధ్బుతంగా ఆహ్లాదకరంగా వుందని పాఠశాల విద్యార్ధులను ఇక్కడికి పిలిపించి ప్రాక్టికల్ గా పచ్చదనం పై వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాణ్యం ఎమ్మేల్యే కాటసాని

రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మానవుని మనుగడకు చెట్లే ప్రధాన కారణమన్నారు. ఆదర్శ పాఠశాలలు, ప్రభూత్వ పాఠశాలల్లోని ఖాలీ ప్రదేశాల్లో విరివిగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.

చెరువులు నింపెందుకు అవసరమైన పంపులు, మోటార్లను మంజురుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.  ఒక చెట్టు పరిపక్వత చెందితే పది మందికి ఉపయోగపడే ఆక్సిజన్ ను

అందిస్తుందని చెట్లు నరకకుండా కాపాడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు, పత్తి కొండ శ్రీదేవి మాట్లాడుతూ పుటినరోజు, పెళ్లి రోజుల జ్ఙాపకార్ధంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని

చేపటాలన్నారు. అడిషనల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ గోపినాద్ మాట్లాడుతూ 1950 సంవత్సరం నుండి ప్రతి ఏడాది వనం-మనం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని

చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  మనిషికి ఒక మొక్క చొప్పున 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధెశించిందన్నారు. అంతకుముందు వనం-మనం కార్యక్రమంలో మంత్రి, ఎమ్మేల్యేలు,

కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం వనం-మనం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక అడవుల డిఎఫ్ ఒ ప్రసూన, డిఎఫ్ ఓలు శివరామకృష్ణ , చక్రపణిలు,

జలవనరుల శాఖ సిఇ నారాయణ రెడ్డి, ఎన్ఇ రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts