*పల్లవి:*_
నేను పుట్టాను,
లేండ్ లైన్ వచ్చిందీ ... ... ...
నేను ఏడ్చాను,
సెల్ ఫోన్ వచ్చిందీ ... ... ...
నేను నవ్వాను,
స్మార్ట్ ఫోన్ వచ్చింది.
నాకింకా లోకంతో పని ఏముంది.
డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥
_*1వ. చరణం:*_
మనిషిని మనిషిని కలిపేటందుకు
లేండ్ లైన్ వచ్చిందీ ...
ఎవరికి దొరకక తిరిగేటందుకె
సెల్ ఫోన్ వచ్చిందీ ...
ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై
స్మార్ట్ ఫోన్ పుట్టిందీ ...
అందరి బుర్రలు నమలడానికే
వాట్సాప్ వెలిసింది.
డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥
_*2వ చరణం:*_
లేండ్ లైన్ మ్రోగితే,
అందరి గుండెలు ఆనందించాయీ ...
సెల్ ఫోన్ మ్రోగితే,
అందరి మనసులు చిరాకు పడ్డాయీ ...
స్మార్ట్ ఫోన్ తో,
అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ...
తెల్లవారినా అవి,
కొంచెం కూడా బాగవ కున్నాయి.
డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥
_*3వ చరణం:*_
వాట్సాపులో వసతులతోటీ,
షరతులు వున్నాయీ ...
హద్దు మీరితే అంతు తెలియనీ,
శిక్షలు పడతాయీ ...
స్మార్ట్ ఫోనులో భాషల కుండే,
సొగసులు తగ్గాయీ ...
ఎమోజీ(emoji) లతో,
ఎవరికి తెలియని భాషలు పుట్టాయి.
డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥
_*4వ చరణం:*_
మనుషుల మనసులు,
కలిపేటందుకె ఫోనులు వున్నాయీ ...
ఏ ఫోనైనా,
మంచిగ వాడే మార్గాలున్నాయీ ...
మంచిగ వాడని,
ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ ...
వాట్సాపులో,
పెట్టేటందుకె నీతులు వున్నాయి.
డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥
_*5వ చరణం (ఆఖరి చరణం):*_
గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో,
వాగుతు గడిపేసెయ్ ...
ఫోన్లో వున్న బేటరి తీసి,
బయటకు పారేసెయ్ ...
వైఫై సిగ్నల్ ఆపేసెయ్ ...
సిమ్ము కార్డును విసిరేసెయ్ ...
డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ ... ... ...
హహ్హహ్హహ్హహ్హ !!!
॥నేను పుట్టాను ... ... ... ॥
_*ప్రేమ్ నగర్*_ సినిమా లోని
_*ఘంటసాల మాస్టారు*_ పాడిన
_*నేను పుట్టాను ... ... ... *_
పాటకు వరుస అన్వయం.