అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందడంలేదని తాము లేవనెత్తిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ నివేదికల ద్వారా స్పష్టంగా చెప్పారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి
అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ చేతిలో తెలంగాణ కుళ్లిపోయిందని విమర్శించారు. న్యూయార్క్ సెంటర్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై యాడ్
వేసుకుంటే.. అది తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నారని అవార్డులు, రివార్డులను కొనుక్కుని గోబెల్స్ ప్రచారం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో గత ఐదేళ్లలో శాఖల
పనితీరుపై సీఎస్ ర్యాంకులు ఇచ్చారన్నారు. కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయని విమర్శించారు. విద్యుత్ సంస్థల్లో రిటైర్డ్ అధికారులను తొలగించి ఐఏఎస్‌లను
నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. దోపిడీపై ఫిర్యాదు చేస్తారని ఇప్పటివరకు ఈఆర్సీని నియమించలేదని విమర్శించారు. తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవమని సీఎస్ నివేదిక చెప్పకనే
చెప్పిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.