కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా ఎదురుదెబ్బలు చవిచూస్తున్నా పాక్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం ఇండియాతో సంప్రదింపులను
తాము కోరుకుంటున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మంగళవారంనాడు ఓ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతర్గత, బహిర్గత అంశాలను దృష్టిలో ఉంచుకుని పాక్ విదేశాంగ
విధానం రూపొందిందని, సమర్ధవంతమైన విదేశాంగ విధానం ద్వారా పాక్ ప్రపంచ దేశాల్లో గుర్తింపుపొందిందని అన్నారు. భారత బలగాలు కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మూసివేయడం ద్వారా బయట
ప్రపంచంతో కశ్మీర్ ప్రజల సంబంధాలను తెంచివేసిందని ఆరోపించారు.జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాక్
కుతకుతలాడుతోంది. ఇది భారత్ అంతర్గత విషయమని ప్రపంచదేశాలన్నీ సమర్ధించినప్పటికీ, పాక్ మాత్రం కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు అందివచ్చే ఎలాంటి అవకాశాన్ని
వదులుకోవడం లేదు. కశ్మీర్‌లో అనునిత్యం శాంతి భద్రతల విఘాతానికీ వెనుకాడటం లేదు. ఇటీవల అమెరికాలో పర్యటన సందర్భంగా తమ దేశంలో సుమారు 40,000 మంది ఉగ్రవాదులు
ఉన్నట్టు గుర్తించామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ప్రకటించారు.