YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఇక నేరుగా సింగపూర్ కి వెళ్ళవచ్చు

Highlights

అంతర్జాతీయ సర్వీసుల పరిశీలన 
గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించిన సిల్క్‌ ఎయిర్‌ బృందం 
15 తర్వాత అంతర్జాతీయ సర్వీసులు

ఇక నేరుగా సింగపూర్ కి వెళ్ళవచ్చు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చరబాబు నాయుడు ఇక  అమరావతి నుంచే నేరుగా సింగపూర్ వెళ్ళవచ్చు. ఆ దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న అవకాశాలపై సింగపూర్‌ విమానయాన సంస్థకు చెందిన సిల్క్‌ ఎయిర్‌ దృష్టి పెట్టింది.  సింగపూర్‌ నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడానికే ఈ బృందం విచ్చేసింది. అంతర్జాతీయ టెర్మినల్‌ భవనంలో ఉన్న ఏర్పాట్లు, రన్‌వే సహా అన్నింటినీ పరిశీలించారు. విమానాశ్రయంలో ఉన్న ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. సిల్క్‌ఎయిర్‌ భారత ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలోని బృందం విమానాశ్రయాన్ని తాజాగా సందర్శించింది. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. విజయవాడ నుంచి ముంబయికి ప్రస్తుతం నడుస్తున్న ఎయిరిండియా సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు కేంద్ర విమానయానశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా సిల్క్‌ఎయిర్‌ కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణామం.విజయవాడ నుంచి నేరుగా దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు విమాన సర్వీసులను తొలుత ప్రారంభించాలని స్థానిక పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఆ రెండు దేశాలకు వెళ్లిపోతే ప్రపంచంలో ఎక్కడికైనా తేలికగా చేరుకునేందుకు విమాన కనెక్టివిటీ ఉంటుంది. అందుకే తొలుత కనీసం వారంలో రెండు మూడు రోజులైనా దుబాయ్‌, సింగపూర్‌లకు సర్వీసులను నడపాలని ఇక్కడి వాళ్లు కోరుతున్నారు. ఈ నెల 15 తర్వాత అంతర్జాతీయ సర్వీసులు  నడిపేందుకు తాము సిద్ధంగా ఉంటామంటూ విమానాశ్రయం అధికారులు ఎయిరిండియాకు కొద్దిరోజుల కిందట లేఖను సైతం సమర్పించారు. విదేశీ సర్వీసును ప్రారంభించాలంటే కనీసం 45 రోజుల ముందు నుంచి టిక్కెట్లను విక్రయించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా ఎయిరిండియాకు విమానాశ్రయం తరఫున అనుమతి తెలియజేస్తూ లేఖను పంపించారు.
సేవలకు సిద్ధమైన సిబ్బంది.. 
విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన 15 మంది సిబ్బంది గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇమ్మిగ్రేషన్‌ సేవలను స్థానిక పోలీసుల ద్వారానే నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. తొలి దశలో 15 మంది పోలీసు సిబ్బందికి గన్నవరం విమానాశ్రయంలో వారం రోజుల శిక్షణ అందించారు. కేంద్ర ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది వచ్చి వీరికి తర్ఫీదునిచ్చారు. అనంతరం హైదరాబాద్‌ శంషాబాద్‌లో వీరికి మరో పది రోజుల శిక్షణ అందించారు. విదేశీ విమానాలు తిరగాలంటే ఇమ్మిగ్రేషన్‌ విభాగమే అత్యంత కీలకం. అందుకే ముందుగా సిబ్బందిని సిద్ధం చేశారు.
 

Related Posts