YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జియో గిగా ఫైబర్ సేవలు రేపే ప్రారంభం..!!

 జియో గిగా ఫైబర్ సేవలు రేపే ప్రారంభం..!!

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రిలయన్స్ సంస్థ.. జియో గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు రేపు ప్రారంభం కానున్నాయి. జియో ఫైబర్ లో వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు ప్లాన్స్ ఉన్నాయి. వీటి నెలవారీ ఛార్జీలు రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. జియో ఫైబర్ 'జియో ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు కొత్త సినిమాలను థియేటర్ కు వెళ్లకుండానే, ఇంట్లో కూర్చొని వీక్షించవచ్చు. అయితే, ఈ సర్వీస్ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది.

Related Posts