YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక రగులుతోంది

కర్ణాటక రగులుతోంది

యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏ తప్పు చేయలేదు..కేవలం రాజకీయ కక్షతోనే తనను వేధింపులకు గురి చేస్తున్నారంటున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌ డీకే శివకుమార్. ఈడీ అరెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టానికి తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే..విచారణలో భాగంగా తనకు కనీసం సమయం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను విచారణకు సహకరిస్తుంటే..ఈడీ మాత్రం అరెస్టుకు యత్నించిందన్నారు. మరోవైపు డీకే శివకుమార్ అరెస్టుతో కర్నాటకలో హై టెన్షన్ నెలకొంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేతలు..ధర్నాలు చేపట్టారు. బెలగావి - బగల్కోట్ జాతీయ రహదారిని బంద్ చేశారు. టైర్లకు నిప్పులు పెట్టారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులకు కూడా నిప్పు పెట్టారు. పలు చోట్ల బస్సు ల అద్దాలను పగులగొట్టారు. ఐదు బస్సులు ఆందోళన కారుల దాడిలో ధ్వంసమయ్యాయి. దీంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం కర్నాటక రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఈ మేరకు కేపీసీసీ జనరల్ సెక్రటరీ సత్యన్ పుత్తూర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు పిలుపునిచ్చారు. మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 03వ తేదీ మంగళవారం రాత్రి ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. దర్యాప్తునకు సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఐదు రోజులుగ డీకేని అధికారులు విచారిస్తున్నారు. ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయలని కర్నాటక హైకోర్టును కోరగా..పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. కాగా..ఏడాదిన్నర క్రితం శివకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు దాడి చేసి రూ. 8.59 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts