యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
తనకు మానసిక రోగం ఉందంటూ ప్రచారం చేస్తున్నారని అది అబద్ధం అన్నారు జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ. మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు తనను మోసం చేయడం వల్లే తాను ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన తెలిపానని.. ఇందులో పవన్ కళ్యాణ్‌కు జనసేనకు సంబంధం లేదన్నారామె. జనసేన కోసం ప్రాణం అయినా ఇస్తా అని.. నన్ను అడ్డం పెట్టుకుని కొంతమంది పవన్‌పై బురదజల్లుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది సునీత. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆమె రహస్యంగా తన ఫేస్ బుక్‌ను వీడియో విడుదల చేశారు. అందులో ఆమె ఏమన్నారంటే.. ‘నేను ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నా.. దొంగచాటుగా పోలీస్‌లకు తెలియకుండా మాట్లాడుతున్నా. నా మీద మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. నా మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. నాకు ఎలాంటి మానసిక రోగం లేదు. నన్ను మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేశారు. గీతా ఆర్ట్స్‌లో సినిమా అవకాశాలు ఇస్తానని మోసం చేశారు. నేను డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్లే ఇలా మాట్లాడుతున్నా.. ఇందులో జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదు. జనసేనను పవన్ కళ్యాణ్‌ను వాడుకుని మీడియా వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నన్ను మోసం చేసింది పవన్ కళ్యాణ్ కాదు.. జనసేన కాదు.. కేవలం నిర్మాత బన్నీ వాసు మాత్రమే. నేను బయటకు వచ్చిన తరువాత నిజాలు బయటపెడతా. నేను పాపులారిటీ కోసం ఇది చేయడం లేదు. ఈ ఇష్యూలోకి జనసేన కాని.. పవన్ కళ్యాణ్‌ని గాని లాగితే మర్యాదగా ఉండదు. జనసేన కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధపడ్డా. దయచేసి నన్ను అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్‌ని ఏం అనొద్దు. నాకు ఇండస్ట్రీలో ఎంతమంది నరకం చూపించారో సాయంత్ర చెబుతూ.. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నా.. సాయంత్రం వదిలిపెడతాం అన్నారు. నాకు ఎవరూ కౌన్సిలింగ్ ఇవ్వలేదు. సాయంత్రానికి డీఎస్పీ వస్తానన్నారు.. అల్లు అరవింద్ పెద్దవారు కాబట్టి వాళ్లపై ఆరోపణలు చేయడానికి కారణాలు డీఎస్పీకి చెబుతా. నన్ను నెలరోజులుగా బన్నీ వాసుతో పాటు ఇద్దరు ముగ్గురు ఇండస్ట్రీ వ్యక్తులు టార్చర్ పెట్టారు. వీరి అరాచకాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం కోసమే నేను పోరాటం చేస్తున్నా.. మిగిలిన విషయాలు సాయంత్రం మీడియాకు వివరిస్తా’ పోలీస్ స్టేషన్ నుండి ఫేస్ బుక్ వీడియో విడుదల చేశారు జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ.