YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

8న తమిళసై గవర్నర్ గా బాధ్యతలు

8న తమిళసై గవర్నర్ గా బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరి నియామకపత్రం అందజేశారు. చెన్నైలోని ఆమె నివాసంలో అపాయింట్ మెంట్ లెటర్ ను అందించారు.  కొత్త గవర్నర్ కు వేదాంతంగిరి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళ సై సౌందరరాజన్ ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 10న గవర్నర్ నరసింహన్ గవర్నర్ గా ఇంతకాలం తన నిర్వర్తించిన బాధ్యతల నుండి విరమణ పొందనున్నారు. తెలంగాణ రాష్ట్రం తో ముడిపడిన అనుబంధంపై ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం చెన్నైలోని నివాసంలోనే ఉంటానని చెప్పారు. వడ సాంబార్ తింటూ.. కాలక్షేపం చేస్తానని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కాగా.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు. ఇక దీంతో ఈనెల 11న తమిళ సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళనాడులో జన్మించిన తమిళ సై సౌందరరాజన్ తెలుగు ప్రజల పట్ల కూడా అంతే సహజం భావంతో మెలుగుతానని ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు తెలుగు సోదర , సోదరీమణులతో అనుబంధాన్ని పంచుకోగలగడం తన అదృష్టం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఎప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను గానీ తాను కలవలేదని వెల్లడించారు. ఒకసారి ఫోన్ లో మాత్రం సంభాషించానని ఆమె పేర్కొన్నారు. ఇక తాను రాజకీయాల కోసం కాదు రాజ్యాంగబద్ధంగా పనిచేయడం కోసం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వస్తున్నానని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లుగా ఎంపీగా పోటీ చేసిన ఆమె ఒక్కసారి కూడా గెలవలేదు. మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా మారగా.. ఆయనను తొలగించి సౌందర్యరాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశారు నరసింహన్. రెండు రాష్ట్రాల తొలి ప్రభుత్వాలకు పూర్తి కాలం గవర్నర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకంగా ఆరుగురితో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నరసింహన్, 2010 నుంచి 2019 వరకు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.
చెన్నైలో శేషజీవితం : గవర్నర్
ఏపీలో అనేక సమస్యలున్న సమయంలో గవర్నర్‌గా కాలుమోపానని.. ఇప్పుడు తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని అన్నారు గవర్నర్ నరసింహన్. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మీడియాతో గవర్నర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేశారని.. ఒక్క బుల్లెట్‌ కూడా ఉపయోగించొద్దని ఉద్యమ సమయంలో చెప్పినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన, ఎమ్మెల్యేల రాజీనామాలు, శాంతి భద్రతల సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కున్నామన్నారు. తాను ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయలేదని అన్నారు నరసింహన్.ఎప్పుడూ దేవాలయాలను దర్శించడానికి వెళ్తారంటూ తనపై చేసిన ఆరోపణలు బాధించాయన్నారు నరసింహన్‌. తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాలకే ఎక్కువ వెళ్లానని.. ప్రతిరోజూ హైదరాబాద్‌లోని ఆలయానికి వెళ్తానని చెప్పారు. ప్రతీ మనిషికి వ్యక్తిగత జీవితం ఉన్నట్లే తనకు ఉంటుందని గుర్తుచేశారు. ఇకపై సామాన్యుడిలా జీవితం గడుపుతానన్నారు గవర్నర్‌ నరసింహన్‌. చెన్నైలోనే స్థిరపడతానని చెప్పారు.

Related Posts