ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా 10 మంది కానిస్టేబుల్స్ అరెస్ట్
నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీసు స్టేషన్‌లో స్కాం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ రాత పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు సీఐడీ గుర్తించింది. 2011లో కానిస్టేబుల్స్‌గా సెలక్ట్ అయి పోస్టింగ్ తీసుకున్న 10 మంది కానిసేబుల్స్ రాతపరీక్షల్లో తమకు బదులుగా మరొకరితో పరీక్ష రాయించినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సీఐడీ తేల్చింది. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ పోలీసు స్టేషన్‌లో 10 మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ 10 మంది కానిస్టేబుల్స్‌పై కేసు నమోదు చేసి సీఐడీ అరెస్ట్ చేసింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా 97మంది అక్రమాలకు పాల్పడినట్టు సీఐడీ గుర్తించింది.