YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక రంగంలోకి సింగ్...

ఇక రంగంలోకి సింగ్...

చెట్టుకొకరు పుట్టకొకరుగా ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతలు చెల్లా చెదురు అయిపోయారు. పార్టీ అధ్యక్షుడే కాడే వదిలేసి పోయి షాక్ ఇచ్చారు. కొత్త నాయకత్వంలో అయినా తేరుకుంటుంది అనుకుంటే అదీ లేకుండా పోయింది. రిపేర్ చేసే సమయంలో చిదంబరం వంటి పార్టీ అత్యున్నత నేతను తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. అదే సమయంలో కాశ్మీర్ అంశంపై సొంతపార్టీ నేతల్లోనే కమలానికి ప్రశంసలు. ఇలా మారిపోయింది గ్రాండ్ ఓల్డ్ పార్టీ పరిస్థితి. దీంతో పెద్దాయన మన్మోహన్ సింగ్ ను రంగంలోకి దించారు.మన్మోహన్ సింగ్ కి కిందా మీదా పడి ఈ మధ్యనే రాజస్థాన్ నుంచి రాజ్యసభ బెర్త్ ను ఖాయం చేసింది కాంగ్రెస్. అందరి సంగతి ఎలా వున్నా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటే దేశవాసుల్లో అపారమైన గౌరవం. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పటినుంచి ఆర్దికమంత్రిగా మన్మోహన్ దేశానికి చేసిన సేవ ఆ తరువాత పదేళ్ళు యుపిఎ సర్కార్ లో ప్రధానిగా నీతి నిజాయితీ గా ఆయన నడుచుకున్న తీరుకు మంచి మార్కులే పడ్డాయి. సరిగ్గా ఈ లెక్కలు పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దాయననే ముందు పెట్టి ప్రధాని తో యుద్ధం చేయాలని నిర్ణయించింది.మౌనమునిగా ముద్ర వేసుకున్న మన్మోహన్ మాట్లాడటం కానీ విమర్శలు, ఆరోపణలకు దూరంగా వుంటారు. అలాంటి మాజీ ప్రధాని దేశంలో ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యానికి కారణం మోడీ విధానాలే అంటూ నేరుగా దుమ్మెత్తి పోశారు. ప్రఖ్యాత ఆర్ధిక వేత్తగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న మన్మోహన్ వ్యాఖ్యలు కమలం పార్టీలో కలవరం రేపాయి. ఆయన స్థాయి నేతలు ఎవరు కౌంటర్ ఇచ్చేందుకు సైతం కాషాయంలో ఇప్పుడు ఎవ్వరు లేరు. అరుణ్ జైట్లీ వంటివారు కాలం చేయడంతో మన్మోహన్ తో తలపడే వారికోసం కమలం అన్వేషణ మొదలు పెట్టింది. మాజీ ప్రధాని ఇక పై ప్రధాని ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తుంది అని బిజెపి అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే సింగ్ అస్త్రాలు తిప్పికొట్టే సత్తా ఉన్నవారి కోసం వేచి చూస్తుంది కమలం. మరి ఎవరు మౌనమునిని ఎదుర్కొనే హీరో ఎవరో వేచి చూడాలి.

Related Posts