హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలకు రాష్ట్రంలోని అర్హత కలిగిన నిరుద్యోగ వికలాంగులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు.అర్హతకలిగిన నిరుద్యోగ వికలాంగులు www.tvcc. telangana.gov.in, www.wdsc.telangana.gov.in వికలాంగుల సంక్షేమశాఖ వెబ్‌సైట్‌ల ద్వా రా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులకు ఈ నెల 20 తేదీలోగా సమర్పించాలని సూచించారు.