YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ లో  కారు బీభత్సం

Highlights

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు పల్టీ 

హైదరాబాద్ లో  కారు బీభత్సం

హైదరాబాద్ లో ని ట్యాంక్ బండ్  సమీపంలో గల ఎన్టీఆర్ ఘాట్ ఎదుట సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ ఫై ఓవర్ నుంచి ట్యాంక్ బండ్  వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఎన్టీఆర్ ఘాట్ ముందు డివైడర్ ను  ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. కారులో ఉన్న వారిని హుటాహుటిన బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు.. కారును ట్రాఫిక్ వాహనంతో వేరేచోటికి తరలించారు.

Related Posts